నువ్వేనా నువ్వుగా ఉన్న ఎవరోనా
కాలం కాటేసింది అనుకోకు
గమ్మత్తుగా ముఖం మర్చిపోకు
నీకు బదులు నీ చిరునవ్వు చాలు
నిన్ను అణచివేసే శక్తులు ఎందుకు
ఓర్పు లేని ఒంటరితనం ఎందుకు
ధైర్య సాహసి లక్ష్మి అనుకో
ఒంటరి పోరాటం అయిన చెయ్యి
నువ్వు గెలిచి నిలబడు
గెలవాలని ఆశ ఉంటే
అవతల వారిని ఓడిద్దాం ధైర్యం ఉంటే
నిన్ను నువ్వుగ గెలువు
అబద్ధం మాటలు విడనాడు
అన్యాయ త్రోవలు కూలదేశి
అకుంఠిత భక్తిశ్రద్ధలతో నడు
నీ పయనం గాంధీ వైపు
నీ గమ్యం సత్యం వైపు
నీ మరణం త్యాగం వైపు
నీ ఆత్మ బలం ఆత్మ అర్పణం కొరకు
ఓడిపోకు మిత్రమ గెలుస్తావు నువ్వు
నేను నిన్ను నువ్వుగా గెలిపిస్తాను
– యడ్ల శ్రీనివాసరావు