నిత్య విద్యార్థి

నిత్య విద్యార్థి

జవాన్ అయితేనే దేశానికి సేవ చేస్తున్నట్టు కాదు. అలాంటి సైనికులను తయారు చేసే ఉపాధ్యాయుల సేవ కూడా దేశ భక్తి గానే పరిగణిస్తారు.

విద్యార్థులకు దేశం గురించి, దేశాన్ని ఎలా కాపాడితే బాగుంటుందో అని నేర్పిస్తూ , వారి ఆలోచనలకు , అనుగుణంగా , ఎప్పటి కప్పుడు వారిని గమనిస్తూ వారి ఆలోచనలు మారుస్తూ , వారికి దేశ భక్తి నింపుతూ , చిన్న నాటి నుండి వారితో ఆట పాటలను రేకెత్తించి వారికి ఎందులో ఆసక్తి ఉందో  గమనించి , తల్లిదండ్రులకు చెప్పి ,

శిక్షణ తీసుకునేలా చేయడం లో ఉపాధ్యాయుల కృషి మెచ్చుకో దగినది. ఉపాధ్యాయులు అంటే ఏదో వచ్చామా చెప్పాం వెళ్ళాం అన్నట్టు గాకుండా పాఠశాల అంటే తన ఇల్లు గా పిల్లలను తన పిల్లలు గా భావించి ,

వారికి అత్యుత్తమ భోదన అందించి నిత్యం తనను తాను తీర్చి దిద్దుకుంటూ తాను నిత్య విద్యార్థి గా మారిపోతూ , కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ పిల్లలతో పిల్లాలుగా మారిపోతూ తన తెలువినంతా పిల్లలకు పంచుతూ, ఎంతో అండగా నిలిచే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు.

వారి జీవితమే మనకు ఆదర్శం . ఒక ఉపాధ్యాయుడు ఎంతో మంది సైనికులను తయారు చేస్తాడు. మరి కొందరిని వారికి డాక్టర్స్, లాయర్స్ ను ఇలా ఏన్ని విధాలా దేశ సేవ చేయొచ్చు అనేది

ఆలోచించే ఉపాధ్యాయుడు చేతిలో ఉంటుంది. అలా ఉపాధ్యాయుడు ఎంతో మంది పిల్లలను తన చేతి తో రూపు దిద్దుతారు. అలాంటి ఉపాధ్యాయుడు కూడా ఒక దేశ భక్తుడే అనుకోవచ్చు…

 

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *