నిశీధి లో
నందిని లేని ఇంట్లో ఉండలేని వాసు అతని తల్లిదండ్రులు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లారు. నందుని వదిలి ఎప్పుడూ ఉండలేని వాసు నందును మర్చిపోవడానికి విపరీతమైన పని లో పడిపోయాడు.
తనని మర్చిపోవాలంటే ఏదో ఒక పని పెట్టుకోవాలని ఆఫీసులో అందరి పని తానే చేయడం మొదలుపెట్టాడు. ఆఫీస్ వాళ్లు కూడా అతని పరిస్థితి గమనించి ఒక్కొక్కరు ఒక పని అప్పగించడం మొదలుపెట్టారు.
అలా ఆఫీసులో అందరి పని చేయడానికి వాళ్ల పనులు అయ్యాయా లేదా అని చెప్పడానికి వాసు వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపు పేరు నందిని గ్రూప్ అని పెట్టాడు.
అందులో ఆఫీసులో వాళ్ళు తనకు ఇచ్చిన ఎవరైతే పని చేశారో వాళ్ల అవగానే వాళ్ళకి ఆ ఫైల్స్ పెట్టడం అయిపోయింది అని చెప్పడం వాళ్లు అది అయిపోగానే ఇంకొక పని ఇవ్వడం ఇలా జరుగుతూ ఉన్నాయి.
రఘురాం గారు హైమావతి గారు కూడా చాలా నిర్లిప్తంగా మారిపోయారు. వాసు ఆఫీసుకు వెళ్తాడు అన్న ఒకే ఒక్క కారణంతో హైమవతి గారు ఎలాగో పొద్దున్నే లేచి ఇంత ఉడకేసి పెడుతున్నారు కానీ వారి జీవితంలో రోజువారి పనులలో యాంత్రికత తప్ప ఒక సంతోషం అంటూ లేదు. అలా రోజులు గడుస్తున్నాయి.
అయితే ఒకరోజు ఆఫీస్ ఫైల్స్ అన్నీ వెతుకుతున్నప్పుడు అందులో ఒక ఫైల్ మిస్ అయిందని వాసుకి తెలిసింది. దాంతో ఆ ఫైల్ గురించి తన తల్లిని అడిగాడు.
ఏమోరా వాసు మనం ఇల్లు మారేటప్పుడు కొన్ని ఫైల్స్ అక్కడే మర్చిపోయినట్లు ఉన్నాం నీకు కావాలంటే వెళ్లి తెచ్చుకో ఇంకా అలాగే ఉంచారు అందులోకి అద్దెకు రాలేదు నిన్ననే ఆ ఇంటి ఓనర్ నాకు ఫోన్ చేశారు అంటూ చెప్పింది హైమావతి.
సరే అమ్మ సాయంత్రం వెళ్తాను ఇంకా కొన్ని వస్తువులు కూడా అక్కడే ఉన్నాయ్ అని నేను మర్చిపోయాను అంటూ చెప్పాడు తల్లితో వాసు.
కానీ బాబు అక్కడికి వెళ్లాలంటే నీకు బాధ గా ఉండొచ్చు వెంటనే వచ్చెయ్ లేదా నన్ను వెళ్లి తీసుకు రమ్మంటావా అంటూ అడిగింది కొడుకు బాధ తెలిసిన ఆ తల్లి.
పరవాలేదు అమ్మా నేనే ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం అక్కడికి వెళ్లి వెళ్తాను. నువ్వేం కంగారు పడకులే నా గుండె ఇంకా గట్టిగానే ఉంది అంటూ చెప్పాడు. సరే నీ ఇష్టం అంటూ బాక్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది తల్లి.
సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత వాసు ఇంతకుముందు ఉన్న ఇంటికి ఫైల్స్ కోసం వెళ్ళాడు. వాసు ని చూసి ఆ ఇంటి ఓనర్ ఏమయ్యా వాసు సగం సామాన్ ఇక్కడే వదిలేసి వెళ్లారు వద్దనుకున్నారా ఏంటి అంటూ అడిగాడు.
అయ్యో అదేం లేదండి మర్చిపోయి ఉంటాం అంతే అంటూ చెప్పాడు. ఇప్పుడు వాటి కోసమే వచ్చాను అని వాసు అనడంతో ఓ అవునా ఇంకా నేను ఆ వస్తువులు అన్నీ వదిలేశారు అనుకున్నాను నిన్ననే మీ అమ్మ గారికి ఫోన్ చేశాను.
నీకు చెప్తే బాగుంటుంది కదా అంటూ అన్నాడు. అమ్మ చెప్పింది అందుకే నేను ఇలా వచ్చాను అనడంతో సరే తీసుకెళ్ళు అంటూ ఓనర్ వెళ్లి ఫ్లాటు తాళం చేతులు తీసుకొని వచ్చాడు.
ఆవి వాసుకి ఇస్తూ ఇంకా ఎవరూ రాలేదు అయ్యా ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చి ఫ్లాట్ చూసి వెళ్లారు కానీ ఇంకా ఏ విషయం చెప్పలేదు అన్నాడు ఆ ఇంటి ఓనర్.
అవునా అంత తొందరగా వస్తే మంచిది నేను ఎప్పుడో సామాను తీసుకుని వెళ్తాను అంటూ తాళాలు తీసుకుని తన పక్క ఫ్లాట్ లోకి వెళ్ళాడు.
తాళం తీసి లోపలికి అడుగుపెట్టిన వాసుకి ఒక్కసారిగా నందిని గుర్తొచ్చి మనసంతా బాధతో నిండిపోయింది.
అసలు మర్చిపోతే కదా గుర్తు రావడానికి ఎన్నో ఆశలతో ఇంట్లోకి తన జీవితంలోకి ప్రవేశించిన తన అర్ధ భాగం నందిని ఇలా అర్ధాంతరంగా తనువు వదిలేసి వెళ్ళడం చాలా బాధ కలిగించింది.
నిజానికి వాళ్లకి ఏ సమస్యలు లేవు కానీ తను అలా ఎందుకు చేసింది అనేది ఇప్పటికీ తనకి అర్థం కావడం లేదు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో కొత్త జీవితం ప్రారంభించారు.
తమకు ఇద్దరు పిల్లలు ఒక మంచి ఇల్లు మంచి కారు కొనుక్కొని హాయిగా సంతోషంగా ఉండాలి అనుకున్న పిల్లలకు పిల్లలు పుట్టి తన వాళ్ళతో ఆడుకున్నట్టుగా ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలన్నీ కలలే కలిగిన కన్నీరే మిగిలింది.
ఇలా అర్ధాంతరంగా తనువు ఎందుకు చేసిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే అది కూడా లేవు తను చాలా మంచిది.
చిన్నప్పటినుంచి ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా పెరిగింది. కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు ఆచార వ్యవహారాలు అంటే చాలా ఇష్టం నందిని కి.
తన పెళ్లి కూడా తన తల్లిదండ్రుల ఇష్టప్రకారమే చేయమని వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటా అంటూ వాళ్ళు చూసిన వ్యక్తిని చేసుకుంది కానీ దీనికి అభ్యంతరం చెప్పలేదు.
తను బాగానే చదువుకుని ఉద్యోగం చేయాలనే అనుకుంది కానీ అనుకోకుండా తన సంబంధం రావడంతో ఉద్యోగం కూడా మానేసింది.
పెళ్లి తర్వాత కూడా నువ్వు ఏదైనా ఉద్యోగం చేయాలంటే చేయి అని తను ఎంతగా చెప్పినా మిమ్మల్ని చూసుకోవడమే నా ఉద్యోగం అంటూ తన ఇంటికే పరిమితం అయింది.
టీవీ, ఫోను లాంటివి తన వాడేది కాదు. ఎందుకు వాడవు అంటే అందులో ఏముంటుంది అంత సొల్లు తప్ప ఒకరిపై ఒకరు మార్చుకోవడం తిట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు మంచి విషయాలు ఉన్నా కూడా నాకు మిమ్మల్ని చూసుకోవడమే నాకు గొప్ప.
ఇది నా బాధ్యత ఈ బాధ్యతను మార్చి నేను టీవీలు సీరియల్లో చూసుకుంటూ ఫోన్ వాడుతూ పగలు ప్రతీకారాలు పెంచుకోవడం వాటిని చూస్తూ అనవసరంగా మానసిక ఒత్తిడికి గురవడం ఎందుకు అంటూ తనకు నీతులు చెప్పేది.
తనను కూడా స్మార్ట్ ఫోన్ మానిపించి చిన్న మామూలు ఫోను వాడేలా చేసింది. అసలు నందిని ఇలా ఎందుకు చేసిందో తనకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఈ ఆలోచనలో ఉన్న వాసు బెడ్ రూమ్ లోకి వెళ్ళిన సంగతి కూడా గమనించుకో లేదు తర్వాత ఫోన్ లో ఏదో మెసేజ్ లు రావడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి బెడ్ రూమ్ చుట్టూ చూశాడు.
ఆ బెడ్ రూమ్ చూస్తుంటే గత జ్ఞాపకాలను తన మదిలో మెదిలే రాసాగాయి. ఆ ఇంట్లో మొట్టమొదటి సారి తన మొదటి రాత్రి జరిగింది.
ఆ రోజు రాత్రి అందంగా అలంకరించుకున్న నందిని సిగ్గుపడుతూ సన్నజాజులు తలలో తురుముకొని చేతిలో పాల గ్లాస్ తో అందమైన తెల్లని చీరలు తెల్లని హంసలా వయ్యారంగా నడుస్తూ తన దగ్గరికి వచ్చింది.
ఎంగేజ్మెంట్ పెళ్లిలో తననే చూస్తున్నా కూడా ఇప్పుడు ఈ తెల్లని వస్త్రాలలో ఒక దేవతలా కనిపించింది నందిని. తర్వాత మాటల్లో తన స్వచ్ఛమైన తెల్లని కాగితం లాంటి మనసు తనకి ఎంతో నచ్చింది.
పెళ్లికి ముందు తాము ఎక్కువగా మాట్లాడుకోలేదు కాబట్టి మొదటి రాత్రి రోజు నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఎన్నో పంచుకున్నారు.
ఎన్నో మధురానుభూతులు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. మాటలతో సగం రాత్రి గడిచిపోయిన తనకి అసలు కార్యం సంగతి గుర్తుకు రాలేదు.
మాటల్లో పడిన ఇద్దరు దగ్గరైనప్పుడు ఒకరి లో ఒకరు లీనమయ్యారు కూడా తెలియలేదు. ఆ తర్వాత నందిని తనకెంతో ప్రియమైన దాన్ని గా అనిపించింది. ఎన్నో మధురమైన రాత్రి అన్నీ ఈ గదిలో గడిచిపోయాయి.
ఆ మధురమైన నిశీధిలో కలహంస లాంటి నందిని ఒడిలో పడుకొని ఎన్నో కలలు కన్నారు ఎన్నో భాషలు చేసుకున్నారు. ముందు భవిష్యత్తుకై ఎన్నో కార్యాచరణ ప్రణాళికలు వేసుకున్నారు.
నాలుగేళ్ళు నాలుగు నిమిషాల్లో గడిచి పోయినట్టు అనిపించింది. తను చనిపోయే ముందు రోజు కూడా అదే గదిలో ఆ నిశిరాత్రిలో కిటికీ దగ్గర కూర్చుంటే తన తల పెట్టుకొని పడుకుంది.
అప్పుడు తాము అనుకున్న మాటలు ఇంకొక సంవత్సరం లో కొత్త ఇల్లు కట్టుకోవాలని అందులో అందమైన తోట వేసుకోవాలని తోటలో ఉయ్యాల కట్టుకోవాలని ఎన్నో ఊహలు తనతో పంచుకుంది.
చిన్న పిల్లలా ఉయ్యాల ఊగుతారు అంటూ మాట్లాడే మాటలు ఎంతో నవ్వు తెప్పించాయి. ఆ మాటలు గుర్తొచ్చి వాసు బయటకే నవ్వుకున్నాడు.
ఏంటయ్యా వాసు నీలో నువ్వే నవ్వుకుంటున్న అంటూ వచ్చాడు ఇంటి ఓనర్.. ఆ మాటతో నందిని ఊహల్లో నుంచి బయటకు వచ్చిన వాసు ఏం లేదండీ అంటూ కిటికీ పక్కన ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకొని నా ఫైల్స్ అన్నీ తీసుకున్నాను అండి ఇక వెళ్లి వస్తాను అంటూ బయటకి వచ్చాడు.
అతనితో పాటే ఇంటి ఓనర్ కూడా బయటకు వస్తూ, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు వాసు నేను బ్రతుకుతున్న కదా నాకు ఆధారం ఏమీ లేకుండా అయింది అంటూ వాసు తో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
ఆ ఇంటి ఓనర్ తో కచ్చితంగా చెప్తాను అంటూ తన బైక్ ఎక్కి వస్తానండి ఇక అక్కడ సెలవు తీసుకుని బైక్ ముందుకు కదిలించాడు.
తీసుకున్న ఫైల్స్ లో ఒక ఎల్లో కలర్ ఫైలు చాలా అందంగా ఎంతో ఆకర్షణ గా ఉంది. అతని దృష్టి ఆ ఫైల్ మీద పడిన కూడా దాన్ని తరచి చూడాలని ఉన్నా కూడా బైక్ మీద ఉన్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళాక చూడొచ్చు లే అంటూ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు వాసు.
ఇంతకీ అన్నిటికంటే భిన్నంగా ఉన్న ఆ ఎల్లో కలర్ ఫైల్ లో ఏముంది? వాసు దాన్ని తెరిచి చూసాడా? లేదా అనేది మనం చివరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం…
– భవ్యచారు