నిర్ణయం 

నిర్ణయం 

కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నేను అయితే చాలా నిర్ణయాలు తీసుకుంటాను. అవేంటంటే  బట్టలు ఎక్కువ కొనొద్దు అని, డబ్బులు ఖర్చు చేయొద్దు అని, బాగా నిద్ర పోవాలని, బాగా తినాలి అని, ఇలా చిన్న చిన్నవే .

మీకు అనిపించవచ్చు ఇవేం నిర్ణయాలు అని వాటికి ఒక లెక్క ఉంది (చిన్నవే కాని అనుభవం లోకి వస్తే అవెంత పెద్దవో తెలుస్తుంది) చెప్తాను వినండి..

బట్టల విషయానికి వస్తే బయట షాప్ లో కాస్త మంచిగా అనిపించిన డ్రెస్ ఏదన్నా ఉంటే వెంటనే నా కాళ్ళు, కళ్ళు అటే వెళ్తాయి. అప్పు చేసైనా సరే దాన్ని కొంటాను.

ఇది తెలిసి మా అమ్మ మొత్తుకుంటుంది. వద్దే వద్దే ఉన్నవి వేసుకోవే అని కానీ మనం వింటామా వినము కదా పోనీ  అలా కొన్న డ్రెస్ వేసుకుంటానా అంటే అది లేదు.

ఒక్కసారి వేసుకుని పక్కన పెట్టెస్తా, అంతే మళ్లీ దాని జోలికి వెళ్ళను. అక్కడికి మనం పెద్ద ధనవంతులమా అంటే అది కాదు మధ్య తరగతి మహానుభావులం.

అందుకే అమ్మ తిట్లు , దీవెనలు అయినా ఊరుకోం గా 🤪🤪🤪

కొన్నవి అన్ని అలా దాచుకోకుండా వేసుకుంటే మా అమ్మ తిడుతుంది. ఒక్క కొత్త డ్రెస్ కూడా పండగకి ఉంచుకోకుండా వేసుకుంటావు అని.

కానీ ఏం చేస్తాం మళ్లీ కొత్తగా కొనడమే. దానికే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతావా అని కోప్పడుతుంది. ఇక నిద్ర సంగతి ఏంటంటే నైట్ పదిన్నరకు పడుకుంటా.

అప్పటి దాకా ఏం చేస్తాను అంటే కథలు రాయడమో లేదా ఫోన్ పట్టుకుని యుట్యూబ్ చూడడం లాంటివి చేస్తా. దాని వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని తిడుతుంది అమ్మ.

నిజమే అమ్మ అనేది కానీ అమ్మకు ఏం తెలుసు మనకు ఆలోచనలు వచ్చేదే ఆ సమయంలో అని తీరిక దొరికేదే అప్పుడు కదా అందుకని అలా రాస్తాను అన్నమాట..

ఇక తిండి పొద్దున లేస్తే పనులతో ఉద్యోగంతో టిఫిన్ చేయడానికి టైమ్ ఉండదు. అందరికీ చేసి పెడతాను కానీ నేను మాత్రం తినను.

టిఫిన్ చాలా ముఖ్యం కదా, దాన్ని అవాయిడ్ చేస్తావు కోడి గెలికినట్టు గెలుకుతావు అంటూ రుసరుసలు ఆడుతూ ఉంటుంది.

ఇదిగో ఇలాంటివి చూడడానికి చాలా చిన్నగా అనిపించినా అనుభవిస్తే తెలుస్తాయి. అమ్మా చాలా చెప్తుంది. మన గురించి ఆలోచించేది మన అమ్మనే కదా…

ప్రతీ కొత్త సంవత్సరం అన్ని మానేయాలి అనుకుంటాను. డబ్బులు దాచుకోవాలి అనుకుంటాను కానీ కొత్త డ్రెస్ కనిపించగానే నా కోతి మనసు ఊరుకోదు.

డబ్బు, ఆరోగ్యం, రెండూ పోతే ఏమి చేయలేము కదా, కనీసం ఈ కొత్త సంవత్సరం అయినా వీటిని ఖచ్చితంగా పాటించాలి అని గట్టి నిర్ణయం తీసుకుంటున్నా..

మీరేం అంటారు నా నిర్ణయం సరైందే అంటారా? మీరేలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పండి. క్యామిడి గా…

-భవ్య చారు

0 Replies to “నిర్ణయం ”

  1. మనసు చెప్పిన మాటలే వినాలి. నిర్ణయాలు మారుతూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *