నిరీక్షణ
మబ్భులు కమ్మిన ఆకాశంలో…
వెన్నెల రాకకై చూస్తూ
ప్రేమ లో మునిగిన మనసు
సన్నని కూనిరాగమేదో తీస్తుంది
క్షణాలు యుగాలైన వేళ
ప్రతి చప్పుడులో తనదైన గుండె సవ్వడి కోసం..!!
భాషే లేని నీ చూపులలో
భావాల కై వెతుకుతూ
నన్ను నేను మరిచే…
క్షణం కోసం వేచిన నా హృదయం…
వర్షించని మేఘం కదలి వెళుతున్నట్లు
ఆలోచనలు తెరలు తెరలుగా సాగుతున్నాయి
వెలుగు రేఖ లేవో
నక్షత్ర రాశులై కడలిని చేరిన్నట్లు
చల్లగాలికి వెన్నెల తొడై…!
ప్రేమ తుంపెరలలో తడిచి పోవాలని…,
మరు పున్నమికైనా…
మరలి వచ్చే కాలాన్ని
తోడుగా తీసుకొస్తావని
పెనవేసిన చేతులతో….
తీరాన్ని తాకిన సంద్రంలా
వసంత కాలానికి
వెన్నెల జలతారు పుష్పమై
నిను చెరాలనే నిరీక్షణలో
ముడి వేసిన మనసులతో
విడి దారులు కలిసే క్షణానికై ….
-గురువర్ధన్ రెడ్డి