నిరీక్షణం
భగవంతుడా…
ఎందుకిలా చేశావ్…
నేను ఇమడలేని ప్రపంచంలోకి..
నన్ను నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి పడేసావ్..
ఈ కంటకావృతమైన మార్గంలో..
కాంతి శూన్యమైన చీకటిగుయ్యారంలో…
ఏకాకిలా నేను…
ఎలా పయనించాలి?
నా అలుపును తీర్చి, చమటను తుడిచి…
ఓదార్పు మాటలతో…
చుట్టేసే వాళ్ళు ఎవరూ లేరు…
ఈ నైరాశ్యపు నిబిడాంధకారంలో….
నీతో నేనున్నాను…
అనగలిగేవాళ్లే లేరు.,.
నాతో నేను యుద్ధం చేస్తూ..
గెలుపేలేని ముగింపు కానరాని…
చావుపుట్టుకల నిరంతర వలయంలో..
కొట్టుకులాడుతూ…
దిగంతాలలో దృష్టి సారించి….
నీ కడసారి పిలుపు కోసం
ఆర్తిగా ఆర్థిస్తున్నా…
వేగిరమే నా అస్తిత్వానికి ..
స్వస్తి పలకమని….
– మామిడాల శైలజ