నిరీక్షణ
చుట్టూ నిరాశా నిస్పృహలు
ఆనందపడాల్సిన ఒక్క విషయం అంటూ లేదు
ఎక్కడో దాగిన వైరాగ్యం
మనసుని నన్ను తనవశంలోకి తీసుకెళ్తుందేమో
అనే అనుమానము
ఉప్పెనలాంటి ఈ కన్నీళ్ళని
తుడిచేవారికోసమే నా నిరీక్షణ
నా నిరీక్షణలు సఫలమై
నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి ఆహ్వానించి
నాపై కురిపించిన ఈ ఆనందపు ఝల్లులతో
తడిసి
నీ రక్షణలో ఇలా నిండు నూరేళ్లు ఉంటే
– హిమ