నిరీక్షణ
ఎన్ని జన్మల నిరీక్షణ ఈ క్షణం?
మన కనుల కలయిక లిఖిస్తున్న
ప్రేమ కావ్యానిది ఏ లిపి?
రెప్ప మూసి తెరిచే లోపు
అనుభవించే విరహాన్ని కూడా
తాళలేని ఈ ప్రేమావేశం
ఇన్ని జన్మల ఎడబాటుకు
ఎలా ఓర్చుకుంది?
ఎన్ని యుగాల నిరీక్షణల
తపస్సు ఫలమిది?
కంటి నిండా నిన్ను పొదువుకుందామంటే
రెండే కళ్ళను ఇచ్చాడే దేవుడు
ఎంత పిసినారి ఆ పైవాడు?
– సుస్మిత