నిరీక్షణ
నా మనసుకు పరిచయమేలేని
భావన, “నిరీక్షణ”.
నీవు పరిచయమైన క్షణంలో
నువ్వు పరిచయం చేసిన భావన.
ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన
నీకోసమేనని తెలుపుతుంది.
కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు తెరపడుతుంది.
వీడ్కోలు చెప్పిన క్షణం నుంచి మొదలవుతుంది.
ఎక్కడవున్నా, యదలో తలచుకున్నా,
నా నిరీక్షణ సాగుతూనే వుంటుంది.
నీ లోనే వున్నాను, వుంటున్నాను
అనుకున్న క్షణంలో నిరీక్షణ ఫలిస్తుంది.
లేననుకున్న క్షణం నా జీవనానికి నిరీక్షణ ముగుస్తుంది.
– బి రాధిక