నిన్ను నువ్వు గెలిచిన రోజు
రాహుల్ కొత్తగా బిడియంగా కాలేజీలోకి అడుగు పెట్టాడు అదే రోజు మొదటి రోజు అతని కాలేజీలకి రావడం మొన్నటి వరకు తమ ఊర్లో ఉన్న హై స్కూల్లో చదువుకున్న అతను ఇంటర్ మొదటి సంవత్సరానికి చదవడానికి కొత్తగా జాయిన్ చేశారు తల్లిదండ్రులు జాయిన్ అయిన రోజు తల్లిదండ్రులతో పాటు వచ్చాడు అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఈరోజు మొదటిసారిగా బ్యాగులో పుస్తకాలతో కాలేజీలోకి అడుగు పెడుతుంటే చాలా బిడియంగా కొత్తగా అదొక రకమైన ఆనందంతో ఉత్సాహంగాను అనిపించే సాగింది రాహుల్ కి.
ఏరా ఫస్ట్ యియర్ అహ అంటూ దిగారు సీనియర్ స్టూడెంట్స్, అవునండీ అంటూ వినయంగా సమాధానం ఇచ్చాడు రాహుల్ , ఏరా సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా హా ఎంది బే అంటూ పైకి వచ్చారు సీనియర్స్. అందుకే కదండీ నమస్కారం చేశాను అన్నాడు రాహుల్ బిడియంగా, ఆ దాంతోనే అయిపోలేదు బే నువ్వు మేము చెప్పినట్టు చేయాలి లేదా తెలుసుగా పైంటు ఊడదీసి కాలేజీ అంతా తిప్పెస్తాం తెల్సా అంటూ భయ పెట్టాడు.
దానికి భయపడిన రాహుల్ అయ్యో వద్దండి pls అండి ఏం చేయాలి చెప్పండి అన్నాడు భయంగా , రాహుల్ భయం చూసిన మిగిలిన వాళ్ళు హేళనగా నవ్వుతూ ఒరేయి వీడు మరి ముద్ద పప్పులా ఉన్నాడు రా వదిలేద్దాం అన్నారు.సరే పొరా ఈ రోజుకి నీ డోసు అయిపోయింది. రేపు నువ్వు రాగానే మా వద్దకు వచ్చి నమస్కారం చేయాలి అర్దం అయ్యిందా అన్నారు. అలాగేనని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్ బతికి పోయాను అనుకుంటూ,
రాహుల్ కి తెల్సు కాలేజీలో ర్యాగింగ్ ఉంటుంది అని కానీ ఇలా ఉంటుందని అనుకోలేదు. మామూలుగా పేరు అడగడం పరిచయం చేసుకోవడం ఉంటుందని మాత్రమే తెలుసు. ఇక అది కో ఎడ్యుకేషన్ కాబట్టి ఆడపిల్లలను అయితే మరి ర్యాగింగ్ చేస్తున్నారు. అది చూసిన రాహుల్ కి బాధ తో పాటూ కోపం కూడా వచ్చింది.
కానీ మొదటి రోజు కాబట్టి తన క్లాస్ ను వెతుకుతూ వెళ్ళాడు. క్లాస్ తెలియగానే వెళ్లి కూర్చుని మొత్తానికి సాయంత్రం ఇంటికి రాగానే తల్లితో అన్ని విషయాలు చెప్పాడు రాహుల్ కి తల్లికి అన్ని విషయాలు చెప్పడం అలవాటు.
రాహుల్ చెప్పిందంతా విన్న తల్లి రమ్య బాబు రాహుల్ నువ్వు మగాడివి కాబట్టి తట్టుకుని ఉరుకున్నావు. వాళ్ళు రేపు పైంటూ విప్పిన నువ్వు సిగ్గు పడకూడదు.అలాగే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి.నిజానికి ర్యాగింగ్ చేయొద్దు అని ఎప్పుడో ప్రభుత్వం చెప్పింది.
కానీ ఒక్కటి చెప్తా విను పాపం అమ్మాయిలు ఎంతో కష్టపడి చదివి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా కాలేజీకి వస్తారు. అలాంటి వారిలో సున్నిత మనస్కులు ఉంటారు.వారికి అవమానం జరిగితే చనిపోతారు తప్ప ఎవరికీ చెప్పుకోరు.
నా స్నేహితురాలు అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.దాని వల్ల మా వాళ్ళు నన్ను చదువు మనిపించి పెళ్లి చేశారు. నా డాక్టర్ కావాలనుకున్న కల కల గానే మిగిలి పోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది.
తల్లి కన్నీరు చూసిన రాహుల్ చలించిపోయాడు. ఏమి అనలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్లీ తెల్లారింది.ఎప్పటిలా కాలేజీకి బయలు దేరాడు రాహుల్ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ గదికి వెళ్ళాడు.
ఎవరు బాబు నువ్వు అన్న ప్రిన్సిపల్ మాటలకు తానెవరో ఎందుకు వచ్చాడో అంతా వివరంగా చెప్పాడు.అది విన్న ప్రిన్సిపల్ రాహుల్ ను ముందుకు వెళ్ళమని అనడం తో రాహుల్ అక్కడ ఉన్న మైక్ తీసుకుని గొంతు సవరించుకుని అక్కల్లారా, చెళ్ళల్లారా నమస్కారం నా పేరు రాహుల్. నేను మీలాగే చదువుకోవడానికి వచ్చాను ,కానీ ఇక్కడ సీనియర్స్ మనల్ని ర్యాగింగ్ చేస్తున్నారు.
మీరు ఎవరికీ భయపడకండి ఎవరికీ సమాధానం చెప్పకండి. మనం వచ్చింది చదువుకోవడానికి కాబట్టి మీ తరగతిలో కూర్చోండి. ఎవరైనా మిమల్ని ర్యాగింగ్ చేయాలని చూస్తే పోలీసులకు చెప్తామని అనండి,ధైర్యంగా ఉండండి. మీకు అందరికీ ఒక అన్నగా నేను ఉన్నాను.
ఒరేయ్ ర్యాగింగ్ బ్యాచ్ ప్రభుత్వ చట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది. ర్యాగింగ్ చేశారని ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు మీకు చిప్పకూడే గతి. మరి మీరు చిప్పకూడే తింటారో, లేదా మూసుకుని మాతో కలిసిపోతారో మీ ఇష్టం. బయట నా మాట కోసం పోలీసులు చూస్తున్నారు ఏమంటారు. బుద్ధిగా వెళ్తారా ? లేదా పిలవమంటారా?అంటూ అడిగాడు.
మైక్ లో మాటలు విన్న అమ్మాయిలు చెప్పులు చూపిస్తూ లోపలికి వెళ్లారు.ఇక ర్యాగింగ్ బ్యాచ్ అన్ని మూసుకుని ఎవరి తరగతి గది లోకి వాళ్ళు వెళ్ళారు.
రాహుల్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్పితే ప్రిన్సిపల్ రాహుల్ నీ మెచ్చుకుంటూ భుజం తట్టాడు.
సాయంత్రం మళ్లీ ఇంటికి వచ్చిన రాహుల్ తల్లికి జరిగింది అంతా చెప్పడంతో ఆశ్చర్య పోయింది.అసలు రాహుల్ ఎవరితో కలవడు.బాగా మొహమాటం. అలాంటి వాడు ఈ రోజు తన సత్తా ఏంటో తాను తెలుసుకున్నాడు. తనను తాను నిరూపించుకున్నాడు. ఇక రాహుల్ గురించి బెంగ లేదు అనుకుంటూ రాహుల్ తల నిమిరింది ప్రేమగా….
ఒక్కసారి నిన్ను నువ్వే తరచి చూసుకో నీకు నువ్వేమిటో తెలుస్తుంది.
– భవ్య చారు