నింగి
నింగికి నిచ్చెను వేయడమే కాదు
దాన్ని ఎలా ఎక్కాలో నేర్చుకోవాలి
నింగిలో అందమైన ఉయ్యాల కట్టుకొని
ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊగితే ఆ ఆనందమే వేరు
నింగిలో పక్షి వలె తిరుగుతూ
పక్షులతో స్నేహం చేస్తూ
నాకు విహరించాలని ఉంది…
నింగిలో ఉన్న తారలతో ఒకరోజు మొత్తం గడపాలని ఉంది…
ఎన్నెన్నో అందాలకు ప్రతిది కనువిందు చేస్తున్నాయి
నీకు తీరికలేక చూడలేదు కానీ
నింగి నేల మధ్య వింతలు ఎన్నో
నింగి నుదుటన సూర్యుడు ఎర్రగా ఉన్నాడు
సాయంత్రం వేళలో చిరుగాలి కోసం మేడ మీదకు వెళ్ళితే
అందమైన రంగులు అద్దినట్టు ఉంది నింగి..
దారి తప్పకుండా పక్షులు అన్నీ
కలసి కట్టుగా గూటికి వెళ్లిపోతున్నాయి…
– మాధవి కాళ్ల