నిండుజాబిలి
చిన్నప్పుడు అమ్మగారింటికి అమ్మమ్మ పెట్టిన అవకాయ ముద్దలు తినేసి, బయట మంచాలు వేసుకుని పడుకున్నప్పుడు
అమ్మమ్మ కథలు చెప్తున్నప్పుడుఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండేది.
ఇక పౌర్ణమి రోజున నిండు జాబిలి వెలుతురు లో అందరం చాపలు వేసుకుని కూర్చుంటే అమ్మమ్మ మధ్యలో కలిపి పెట్టే ముద్దల కోసం పోటీ పడే వాళ్ళం.
తిన్న తర్వాత ఆ నిండు జాబిలి నీ చూస్తూ ,చుక్కలు లెక్కపెడుతూ మళ్లీ లెక్కలు తప్పి మొదటి నుండి లెక్క పెడుతూనే కళ్ళు మూతలు పడేవి.
తెల్లారు ఝామున చల్లని గాలికి అసలు లేవలేని అనిపించేది కాదు.ఎండ మొహం మీద పడేవరకు నిద్ర లేవాలి అనిపించేది కాదు…కానీ ఇప్పుడు పిల్లలు ఇరవై నాలుగు గంటలూ ఫోన్ లతో ఆటలాడుతూ నిజమైన బాల్యాన్ని కోల్పోతున్నారు.
అమ్మమ్మ ఊరికి వెళ్ళాలంటే బోర్ మమ్మీ అక్కడ సిగ్నల్స్ రావంటూ మారం చేస్తున్నారు.
దానికి తగట్టు తల్లిదండ్రులూ కూడా డబ్బు సంపాదించాలని మోజు లో పడి అందమైన ఆకాశాన్ని ,చుక్కలను, నిజమైన సహజమైన విషయాలన్నీ మరిచారు. పిల్లలు ఇప్పుడే ఇలా ఉంటే తర్వాతి తరానికీ మనం ఏం చెప్పగలం . తల్లిదండ్రులూ ఒక్కసారి ఆలోచించండి. కనీసం రెండూ రోజులకు ఒకసారి అయినా బయటకు తీసుకు వెళ్లి సహజ ప్రకృతి వనాలను చూపండి…. చూపుతారు కదూ…..
-భవ్యచారు