నీళ్లు

నీళ్లు

నగరానికి దూరంగా ఉన్న చిన్న పల్లెటూరు అది. ఓట్ల కోసం తప్ప అక్కడికి ఎవరూ రారు. అక్కడ ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు అలాగే బడి కూడా లేదు అదొక గిరిజన తాండ అని అక్కడ ఏమీ లేవు.

ఓట్ల కోసం వచ్చినప్పుడు తమకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చమని చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్లు తీరుస్తాం అంటూ అప్పటి బంధం హామీ ఇచ్చి ఆ తర్వాత మొహం కూడా చూపకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పుడు వచ్చిందో ప్రజా ప్రతినిధులు..

అడిగి అడిగి విసిగి వేసారి నా ప్రజలు ఇక అడగడం మానేశారు. మిగతా కాలాల్లో ఎలా ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే మాత్రం వాళ్లకి నీరు అనేది చాలా ముఖ్యం.. ఎండాకాలంలో తాగడానికి నీరు దొరకక పంటలు కూడా వేసేవాళ్ళు కాదు.

తాగడానికి నీళ్లు తెచ్చుకోవాలంటే 10 12 కిలోమీటర్లు వెళ్లి ఎక్కడో చిన్న బావిలో ప్లాస్టిక్ బిందెలతో తెచ్చుకునేవారు. వాటినే చాలా పొదుపుగా వాడుకునేవారు ఒక్కొక్క చుక్క బంగారు బిందువు లాగా చూసుకునేవారు.

ఆ బావిలోతూ చాలా ఎక్కువగా ఉండేది ఎక్కడో అడుగున ఉన్న నీటిని కింద ఉన్నవారు చేదతో తీసి పోస్తూ ఉంటే పైన ఉన్నవారు కి ఒక్కొక్కరికి అందించుకుంటూ ఉండేవారు. అలా బావిలోకి దిగడం ఒక్కొక్కసారి ఒక్కొక్కరి వంతుగా పెట్టుకునేవారు.

అదే తాండాలో బిజిలి అనే మహిళ తన ఏడేళ్ల కొడుకు రాజుతో కలిసి నివసించేది ఆమె భర్త పాము కరిచి చనిపోయాడు.

సరైన వైద్యం లేక అతని బతికించుకోలేకపోయాను అనే దుఃఖంలో బిజిలి చాలా బాధపడింది కొంచెం చదువుకున్నది కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతి ప్రజా ప్రతినిధులతో చిన్న ఆరోగ్య కేంద్రం పెట్టి అన్నయ్య అంటూ ప్రతిసారి మొత్తుకునేది అయినా వాళ్లు పట్టించుకునే వాళ్ళు కాదు.

ఇంకా నీటి కోసం అయితే బిజిలి ప్రతిరోజు 12 కిలోమీటర్లు వెళ్లి వచ్చేది. వాళ్లు కట్టెలు కొట్టుకొని పక్కన గ్రామాలలో అమ్ముకుని బ్రతికేవారు అలాగే ఆరోజు కూడా బిజిలి కట్టెలు కొట్టి పక్క గ్రామంలో అమ్మి వచ్చేసరికి చాలా ఎండగా అయిపోయింది.

ఇంటికి రాగానే గుక్కెడు నీళ్లు తాగుదామని చూస్తే బిందెలో నీళ్లు లేవు. ఆడుకుంటున్న రాజును పిలిచి పక్కింట్లో నుంచి కొన్ని నీళ్లు తెమ్మని పంపింది. రాజు వెళ్లి పక్కింటి వాళ్ళని అడిగాడు కానీ వాళ్లు నీళ్లు ఉన్నా కూడా అయ్యో లేవు అని చెప్పారు.

నిజమే మరి ఈ ఎండాకాలంలో ఆ 12 కిలోమీటర్లు వెళ్లి మళ్లీ నీళ్లు తెచ్చుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా అందుకే నీళ్లు లేవని అబద్ధం చెప్పారు ఆ విషయం బిజీలి కి తెలుసు. వాళ్ల పరిస్థితికి జాలిపడి సరే తానే తెచ్చుకోవాలని అనుకుంటూ బిందె పట్టుకొని వెళ్ళింది.

**********

అసలే రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయి ఆ ఇసుకలో నడవడం అంతకుముందు బాగా నడిచి ఉండడం ఇల్లు తిరిగి కట్టెలవ్వడం వల్ల బిజిలి చాలా అలసిపోయింది ఆమె అడుగులు తడబడుతున్నాయి ఎటు వెళ్ళాలో తెలియకుండా నెత్తి మీద ఎండ బాగా మండిపోతుంది నడుస్తూ ఉంది ఆమె వెనకాలే ఆమె కొడుకు రాజు కూడా వెళ్ళాడు.

కానీ వాడికేం తెలుసు తల్లి పడుతున్న అవస్థ. పొద్దున్నుంచి బిజిలీ ఏమీ తినలేదు పొద్దున్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చి ఇంటికి వచ్చాక అవి మూకులుగా కట్టి పక్కకు గ్రామాలలో అమ్ముకొని వస్తుంది ఆ వచ్చిన డబ్బులతో వాళ్లు వంట చేసుకుని తింటారు ఆ పూటకి. ఏ పూటకి ఆ పూట కష్టపడితే తప్ప డబ్బులు రావు అందువల్లే బిజిలికి కడుపులో ఏమీ లేదు పైగా ఎండ మండిపోతుంది ఓవైపు ఆకలి మరోవైపు దాహం మరోవైపు ఎండాతో అలసిపోయిన బిజిలీ కాళ్లు తడబడుతున్నాయి.

నీటి కోసం ఇంత దూరం రావడం చాలా కష్టం ఒక బోరు వేయించండి, అని ఎన్నోసార్లు ఎంతో మందితో చెప్పింది అయినా ఎవరూ పట్టించుకోలేదు, బిజిలీ నడుస్తోంది, బిజిలీ నడుస్తుంది, ఇంకొక రెండు అడుగులు వేస్తే బాయి దగ్గరికి చేరిపోతుంది. కానీ ఆమె వల్ల అవడం లేదు తను నీరస పడిపోయింది. స్థానిక ఒక్క అడుగు కూడా వేయలేను అని తన వాసు కనిపించ సాగింది అయినా గుక్కెడు నీళ్లు నోట్లో పడితే ప్రాణం లేచి వస్తుంది అనే ఆశతో ఆమె నడుస్తుంది దగ్గరికి వచ్చేసింది.

ఇక బావిలోకి దిగడమే ఆలస్యం. అంతలోనే గుర్తుకు వచ్చింది తను తాడు తేవడం మర్చిపోయింది అని, కిందికి అన్ని మెట్లు దిగాలని ఓపిక లేదు. పైనుంచి తోడుకోవచ్చు కానీ తోడుకోవాలంటే తాడుతో పాటు బోక్కెన కూడా ఉండాలి.కానీ తాను ఆ తాడు బొక్కేన తేవడం మర్చిపోయింది. మళ్లీ ఇప్పుడు అంత దూరం వెళ్లి అవి తీసుకురావడానికి తనకి ఓపిక లేదు. బిజీలి ఆకలి దాహం ఎండ నీరసం ఇవన్నీ కలగలిపి కళ్ళు తిరిగి బిజిలి ఆ బాయి దగ్గర పడిపోయింది.

ఇదంతా చూస్తున్న రాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊర్లోకి వెళ్లి ఎవరైనా పిలుచుకొని రావడానికి అతనికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు తన తల్లికి ఏమైనా జరగవచ్చు. అందుకే రాజు పడిపోయిన తల్లి దగ్గరికి గబగబా వెళ్ళాడు.

తల్లిని ఒకసారి తెలిపారా చూసాడు అతనికి ఏం అర్థమైందో ఏమో కానీ వెంటనే తన తల్లి ఒంటి పైనున్న చీర తీశాడు మెల్లిగా విప్ప సాగాడు. అతనికి ఇవ్వడానికి రావడం లేదు. ఆ చిన్న వేళ్ళతో చేతులతో ఎలాగో చీర మొత్తం లాగేసాడు.

***********

మొత్తానికి చీర అయితే వచ్చేసింది రాజు మెల్లగా బావి దగ్గరికి వెళ్లి భావి చివరలో నిలబడి ఆ చీరను నీళ్లలోకి వదిలాడు. అయినా నీళ్లు అందడం లేదు. తర్వాత ఏం చేయాలో తోచలేదు రాజు కి, బాగా ఆలోచించిన రాజు తన అంగీ విప్పాడు అన్ని చిరిగిన బొంతల్లా ఉన్న అంగీలో ఏదో ఒక రంధ్రంలోంచి చీరకు కట్టాడు. మెల్లిగా దాన్ని బావిలోకి దింపాడు ఇప్పుడు కాస్త దగ్గరగా వచ్చాయి.

ఇంకొంచెం అయితే నీళ్లు అందుతాయి కానీ అందడం లేదు. ఇక రాజు బొక్కబోర్లా  బాయ్ దగ్గర పడుకున్నాడు మెల్లిగా చీరను లోపలికి విడుస్తున్నాడు. అయినా అందడం లేదు. బాయి దగ్గర ఉన్న ఇసుక ఎండకు కాలుతున్న కూడా ఆ బాధను భరిస్తూ రాజు చీరను లోపలిగా వేశాడు.

ఈసారి చీర కొంచెం లోపలికి వెళ్ళింది. అయినా నీళ్లు అందడం లేదు. రాజు తిరిగి లేచి కూర్చొని తన లాగు కూడా విప్పి దానికి కట్టాడు. ఇప్పుడు మళ్ళీ బోర్లా బొక్కలో పడుకొని చీరను బావిలోకి ముంచాడు. ఇప్పుడు నీళ్లు అందాయి, చీర మొత్తం కాకున్నా సగం వరకు తడిచేలా తడిపాడు.

ఆ తర్వాత మెల్లిగా దాన్ని పైకి గుంజాడు. మండుతున్న ఇసుక మీద వాతలు శరీరంపై వాతలు తేలినా కూడా తల్లిని బ్రతికించుకోవాలనే, ఒకే ఒక కోరికతో రాజు ఆ నీళ్లను తీసుకొచ్చి బిజిలీ నోరు తెరిపించి, ఆ నోట్లో చీరకు అంటిన నీళ్లను పోసాడు.అలా రెండు మూడు సార్లు చేసేసరికి, బిజిలికి కొంచెం మెలకువ వచ్చినట్టు అయింది. నాలుక తడిసింది.

*************

ఈలోపు తండాలో బిజిలి కనిపించడం లేదన్న విషయం పొక్కిపోయి, అందరూ బిజిలిని వెతుక్కుంటూ వచ్చారు. ఏ బిజిలి ఎక్కడున్నావు ,బిజిలి కాయి, అంటూ వాళ్ళ భాషలో పిలుస్తూ అరుస్తూ వాళ్ళు బావి దగ్గరగా వచ్చారు.

అక్కడ ఏడేళ్ల రాజు తన తల్లి చీరను తీయడం, తన బట్టలు విప్పి చీరతో నీళ్లు తడిపి తీసుకొచ్చి, తల్లికి పోయడం అందర్నీ కలిచి వేసింది. తమ దగ్గర నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేకపోవడం వల్ల అందరూ తలలు దించుకున్నారు ఈలోపు ఇంకొక వెళ్లి బొక్కెన తీసుకొని వచ్చాడు..

దాంతో బాయిలోకి దిగిన నలుగురు ఐదుగురు బొక్కెనలతో నీళ్లు తీసుకువచ్చి బిజిలి శరీరంపై మొత్తం పోసేశారు అప్పుడు బిజిలి శరీరం చల్లబడింది. అలాగే వార్తలు పడిన రాజు శరీరంపై కూడా కొన్ని నీళ్లు చిలకరించారు. దాంతో వాళ్ళ వేడి చల్లారిపోయింది. ఒక బోక్కేన అయినా తో నీళ్లు తీసుకురావడంతో ఆ బొక్కేన ల్లో ఉన్న నీళ్లన్నీ గబగబా తాగింది బిజిలి.

ఆపమన్న ఆపకుండా తాగుతూనే ఉంది .తాగుతూనే ఉంది, తాగుతూనే ఉంది , అలా నీళ్లు తాగి తాగి కడుపు ఉబ్బిపోయి, కడుపులో ఏమీ లేకపోవడంతో ,ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల బిజిలీ  వాంతులు చేసుకుంటూ, అలాగే అక్కడే తన ప్రాణాలను వదిలింది.

పాపం తల్లి కోసం కష్టపడిన రాజుకు తల్లి లేకుండా పోయింది. అదంతా చూసిన అక్కడి గిరిజనులు చాలా బాధపడ్డారు.

**********

కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి మళ్లీ ప్రజా ప్రతినిధులు ఆ గిరిజన తండాకు వచ్చారు అప్పుడు ఆ గిరిజన ప్రజలు మాకు మంచి నీళ్లు అందితేనే ఓట్లు వేస్తాం అని నిరాహార దీక్ష చేయడం తో, వారి వారికి హామీ ఇచ్చారు కానీ ఈసారి గిరిజనులు ఊరుకోలేదు.

మాకు నీరు లేకపోవడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక బాలుడు అనాధ అయ్యాడు. మాకు నీరు వచ్చేవరకు మేము ఎవరికీ ఓట్లు వేయము. మా గ్రామంలో మా తాండలోకి గాని ఎవరైనా వస్తే చెప్పులతో కోడుతాం అంటూ భీష్పించుకొని నిరాహార దీక్ష చేయడం వల్ల ప్రజాప్రతినిధులందరూ దిగివచ్చి వారికి నీళ్ల ట్యాంక్ తో పాటు ఒక బోర్ కూడా మంజూరు చేశారు. వారం రోజుల్లో ఆ గిరిజన తండాకు నీళ్లు వచ్చాయి.

ఒక ప్రాణం పోతే కానీ వారికి నీటి విలువ తెలియలేదు. ఆ బోర్ కు వాళ్లు బిజిలి బోరు అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ గిరిజన తండాలో నీటికి కొదవలేదు.ప్రతి ఒక్కరూ కడుపునిండా నీళ్లు తాగుతున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ ఏ నీళ్ల వల్ల అయితే తన తల్లి చనిపోయిందో ఆ రాజు మాత్రం అనాధగా మిగిలిపోయాడు.

 

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *