నీళ్ళు
నీరు లేనిదే జీవం లేదు
నీళ్లు లేని ప్రపంచాన్ని ఊహించలేం
ప్రాణికోటికి ఆధారం నీరు
ప్రకృతికి మూలం నీరు
మొక్కలకు మనుగడే నీరు
శరీరానికి శక్తి నీరు
స్వచ్ఛమైనవి కొబ్బరి నీరు
ఆనందాలకు పన్నీరు
పచ్చదనానికి ప్రారంభం నీరు
పశుపక్షాదులకు రక్షణ నీరు
పవిత్ర స్నానాలకు నది నీరు
వ్యవసాయానికి ఆధారం వర్షపు నీరు
త్రాగడానికి కావలసినవి మంచినీరు
ప్రాణం పోయేటప్పుడు కూడా తులసి నీరు
బాధను పోగొట్టుకోవడానికి కన్నీరు
పనికి రానివి మురికి నీరు
ప్రాణాలకు హాని చేసేవి కాలుష్యపు నీరు
ఆవిరైపోతున్నవి అసలైన నీరు
మండు వేసవిలో గుక్కెడి నీటి కోసం పరుగులు
మనం కాపాడు కోవాల్సింది భూగర్భ నీరు
పర్యావరణానికి ప్రాధాన్యం నీరు
భూతాపం నుంచి కాపాడేది నీరే
నీటిని వృధా చేస్తే భవిష్యత్తు తరాలకు మిగిలేది కన్నీళ్లు
ప్రతి చుక్క నీటిని పవిత్రంగా ఒడిసిపట్టి ప్రకృతి సమతుల్యతను కాపాడు కోవడం అందరి కర్తవ్యం
అప్పుడే మానవాళి మనుగడ
సుగమం……
– జి జయ