నిలకడలేని మనిషి
నిలకడ మనిషికి నిలువెల్లా చక్రాలు అంటారు
మనిషి మనసు ఆలోచనల పుట్ట అదే నడిపించే శక్తి
మనిషి మనిషికి అంతరం ఉంటుంది సృష్టిలో
ఏదో చేయాలని
ఎంతో సంపాదించాలని ఆత్రుత మనిషిది
ప్రతి దినం సమస్యల సన్నివేశంతో మొదలై
సమస్యలసందర్భాలతో ముగిసే రోజులు
పరిగెత్తినా పట్టు వదిలినా గడిచే రోజులు కావు
మనిషి ఇలా తయారయ్యాడు చివరకు నిలకడ లేకుండా
ప్రశాంతతను కోల్పోయి
పరిమితులు మరిచిపోయి
కృత్రిమమైన జీవితానికి అలవాటు పడ్డాడు మనిషి
పరిస్థితుల ప్రభావం అయినా కానీ పనుల ఒత్తిడి వల్ల కానీ
నిలకడ లేని మనిషిగా
నిలువునా దహించుకుంటున్నాడు
తనకు తానుగా
ఇదే ప్రస్తుత కాల మహిమ చేసేదేమీ లేక చరిత్ర మారుద్దామనుకొని
మనిషి ఉరుకులు పరుగులు తీస్తున్నాడు అందని దానికోసం…
– జి జయ