నిజానికి ఆయుష్షు ఎక్కువ
నీ గురించి నాకు తెలిసి నిజాన్ని
ఎవరికి చెప్పిన నమ్మరు..
పైగా నన్ను అపార్థం చేసుకుంటారు
నాకు తన మీద కోపంతో నేను
లేని పోని నిందలు వేస్తున్నాను అని చెప్పకుంటారు…
కానీ నేను చెప్పిన దాని గురించి మాత్రం
ఒక్కరైనా ఆలోచించడం లేదు…
నాకు అదే బాధగా ఉంది…
నా దగ్గర కూడా సాక్షాలు లేవు అని
వాళ్ళు కూడా తెగ నటిస్తున్నారు…
నిజానికి నిందలు ఎక్కువ అని
మా బామ్మ చెప్పింది…
తన గురించి పూర్తి సాక్షాలు సంపాదించి
అందరి ముందు దోషిలా నిలబెట్టాను…
నా వాళ్ళు ఇంకెప్పుడు నన్ను అపార్థం
చేసుకోరు…
మంచితనం అనే ముసుగులో
అందరిని సులువుగా మోసం చేయచ్చు
అని అనుకోవడం చాలా తప్పు…
అందరూ ఒకేలా నమ్మిస్తాను అని
అనుకోవడం తప్పు….
మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు
అని అనుకోవడం మన ముర్ఖతత్వం…
నిజానికి ఆయుష్షు ఎక్కువ…
- మాధవి కాళ్ల