నిజమైన స్నేహితుడు

 నిజమైన స్నేహితుడు

ఓ… నా నేస్తమా…
నువ్వు చెయ్యని తప్పుకి
నన్ను వీడి వెళ్లిపోతావని నేను అనుకోలేదు
నన్ను ఇన్ని సంవత్సరాలుగా బాధ పెడుతూనే ఉన్నావ్…
ఎప్పుడొస్తావని నా ఎదురు చూపు నీకోసం చూస్తూనే ఉంది..
ఈ స్నేహితుని ఆ మాత్రమైన క్షమించలేక
నువ్వు నాకు దూరమై
నువ్వునన్ను వదిలేసి దూరంగా వెళ్లిపోతే

నేను సంతోషంగా ఎలా ఉంటారని నువ్వు అనుకుంటున్నావ్…
అందరిలాగే నేను కూడా నువ్వు తప్పు చేశావ్ అనుకోని ,
నేను నీతో మాట్లాడలేదు…
తర్వాత నిజం తెలిసి నేను చాలా బాధపడ్డాను..
ప్రతి స్నేహితుల దినోత్సవం రోజు నువ్వు వస్తావని ఎదురు చూస్తూ
నా చివరి శ్వాస వరకు నీకోసం ఎదురు చూస్తూ బ్రతుకాను…
నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నన్ను చూడాలని
నీ జాడ ఎక్కడ అని వెతుక్కుంటూ
ప్రపంచం మొత్తం తిరుగుతూ
నువ్వు కనిపిస్తావు అని నమ్మకంతో
నీ జాడని వెతుకుతున్న నాకు
నీ జాడ కనిపించడం ,
నీ కళ్ళల్లోకి చూడలేక నీకు క్షమాపణ చెప్పి
వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను..
కానీ నువ్వు నన్ను ఆపి నన్ను క్షమించి
నిజమైన స్నేహితుడవని అని నిరూపించుకున్నావ్..
ఇంకెప్పుడూ నీ విషయంలో తప్పు చేయను
నీ స్నేహాన్ని విడిచిపెట్టను…

 

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *