నిజం
ఐదు నిమిషాల ముందు…
మన చేతులతో…
మన ఇంట్లోనే…
పెట్టిన వస్తువును…
ఎక్కడ పెట్టామో…
గుర్తు చేసుకోవడానికి…
ఐదు గంటలు…
ఐదు రోజులుగా…
వేతికేంత మతి మరుపు ఇస్తున్న ఈ మనస్సు…
ఐదు సంవత్సరాలు…
పది సంవత్సరాలు…
పదిహేను…
ఇలా ఎన్ని సంవత్సరాలు ఐనా
మనతో కలిసి…
మనతో నడచి…
మనతో జీవించిన వ్యక్తి
మన నుండి…
మన ఇంటి నుండి…
మన జీవితం నుండి…
శాశ్వతంగా జరిగిపోయినా…
మరవదు
ఏమీ…
ఎందుకూ…
అంటే…
దానికి మాత్రం నా మనస్సు దగ్గర సమాధానం లేదు.
ఏమీ…
ఎందుకూ…
అంటే…
దానికి మాత్రం ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంటుంది
ఏమీ…
ఎందుకూ…
అంటే…
నువ్వో పిచ్చోడివి అని
రెండు కన్నీటి బొట్లు కారుస్తుంది. అదేంటి అంటే
మన చేతిలో ఉన్న అద్దం , అవును ఎవరికీ
చెప్పుకోలేని బాధలే అద్దం లో నిస్సిగ్గుగా కనిపిస్తాయి, నిజాన్ని చూపిస్తాయి
-జగదీష్