నీ త్యాగ నిరతికి జోహార్లు
ఉపనిషత్ కోణాల ఊరటను
విడనాడిన నీ త్యాగ నిరతికి జోహార్లు
ఆశల కోణాలతో నీకై నీవుగా కట్టుకొన్న
నీతిలేని ఆవరణలో నువొక నులిపురుగుగా
కదులుతు…భౌతిక వాంచల పుట్టలో
చెదగా పుడుతు గిడుతున్నారు…
ఆదరణ కరువై కాని ప్రపంచాన్ని చేతనగా నడిపించుకోవాలనే త్యాగనిరతితో…
ఈలోకం వారసత్వంగా పుట్టిన ప్రతివాడిది
కురూపి తత్త్వమే…ఆశల బదలాయింపులో
మనిషిగా జారిపోతు…నిలువని నీడలలో
పలుకని జాడవవుతు గుర్తించని పొద్దులతో
తెరచాటవుతున్నావు….
మట్టతో మమకారాలు పెనవేసుకొన్న
బంధాలతే…గూడు కట్టుకొన్న ప్రేమలు
కనిపించని దూరాలని...పది నోళ్ళతో
పట్టిందల్లా మింగేస్తు విమర్శ విడ్డురాలతో
త్యాగనిరతిని జాతి వంచనకు గురిచేస్తు…
నీచ బతుకులతో కుళ్ళిన దాన్ని రుచిచూస్తు
అంతులేని నీ ఆత్మకథను నీవే నిర్మూలించు
కొంటున్నావు….
నిరాశా జీవితానికి మిగిల్చేది
నిష్ప్రయోజనమే… పగలబడి నవ్విన
ప్రతికార వాంచలను జీర్ణంచుకోవాలని
చూడకు… త్యాగ నిరతితో తర్పణాలు
కాలాన్ని రచించలేవని…ఊహలను
నడిపించే యానకం మనస్సని…దానికి
తెలియని నిజాలతో కలల ప్రావిణ్యాలను
నడిపించు కోవాలనుకొంటే కుక్కిన
బతుకును అద్దాన చూసుకొన్నట్లే…
-దేరంగుల భైరవ