నీ ప్రేమ మైకం

నీ ప్రేమ మైకం

 

ఓ నాన్న..
నీ మనసే వెన్న..
అమృతము కన్న..
అది యెంతో మిన్న..

నీ ప్రేమ ముందు..
వెల లేని వెన్నో..
నువ్వు లేని లోకం..
చూడలేను నేను..

నీ ప్రేమ మైకం..
కమ్మింది నాకు..
నీతోనె లోకం..
అని నమ్మాను నేను..

నువ్వు లేని ఈ లోకం..
అంతా శూన్యం..
నీ ఒడి గుడిలో..
పెరిగాను నేను…

నీ వేలు పట్టి..
తిరిగాను నేను..
క్షణమైన నిను విడువక..
కలిసున్నా తోడుగా..

ఓ నాన్న…
నీ మనసే వెన్న..
అమృతము కన్న..
అది యెంతో మిన్న..

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *