నీ నీడ కోసం
నీ నీడ కోసం ఆరాటం పడుతూ
నీ నీడ వెంట వేసాను నా అడుగులు
నీ నీడ అనే ప్రేమ సంద్రంలో
నేను ప్రతి క్షణం గడుపుతూ
నీ నీడ ఆసరాగా చేసుకొని
నిరంతరంగా నీ కోసం నిరీక్షించిస్తూ
అందమైన నా కలల ప్రపంచంలో నువ్వు కనిపించిన
ప్రతిసారి కొత్త అనుభూతికి లోనవుతూ
నా కలల ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపిస్తావు అని నిన్ను నమ్ముతూ….
నీ జాడ కోసం నేను జల్లెడు పడుతూ
మనం గడపాల్సిన మధుర క్షణాల కోసం
నేను నీకై ఎదురు చూస్తూ
నాకు తోడుగా నిలుస్తూ
నీకై నేను అండగా ఉంటూ
నా ప్రపంచాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాలని భావిస్తూ….
నా వెంట ఉండే నీడ అవుతావని అనుకుంటూ
నాకున్న ధైర్యం నువ్వు అవుతే
నీ నీడ కోసం నేను అవుతాను భార్యను
నీలో సగం భాగం అవుతాను…
నీకై వేచి చూస్తున్నాను…
-మాధవి కాళ్ల