నిద్రలేమి
నిద్రలేమికి కారణాలు అనేకం.
సమస్యలు ఎదుర్కొంటున్నా,
అనుకున్న పని పూర్తికాకున్నా,
అయినవారు కోపగించుకున్నా,
మనల్ని నిద్రాదేవి కరుణించదు.
నిద్రాదేవి కరుణించాలంటే
సమస్యల గురించి మర్చిపో.
పనులను వాయిదా వేయకు.
అయినవారితో చక్కగా ఉండు.
నిద్రలేమికి మందులు వాడొద్దు.
ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు.
మనసును ప్రశాంతంగా ఉంచు.
గతాన్ని గురించి ఆలోచించకు.
గతాన్ని గురించి ఆలోచించకు.
భవిష్యత్తు అంటే భయం దేనికి.
వర్తమానంలో పనులు చేస్తుంటే
భవిష్యత్తంటే భయం ఉండదు.
-వెంకట భానుప్రసాద్ చలసాని