నెత్తుటి నది
దేహపు మహారణ్యంలో ఆణువణువు కదిలి
రక్తం సముద్రమై ప్రవహించినప్పుడే నువ్వు అక్కడినుండి పుట్టేది.
మర్మాంగాలు నిలబడంగానే మాట్లాడడం కాదురా….
నీ అమ్మనడుగు నువ్వు ఎక్కడినుండి పుట్టావో పక్వానికొచ్చిన దేహపు
మడతల్లో రక్తపు కదలిక నెల నెల అబద్దం కాదు.
ఆ జీవపు ప్రయాణాన్ని ఆపడానికి తరతరాలుగా
కాళ్ల సందుల్లోంచి పారే నెత్తుటి నదుల్లో ఈదాకే కదా నీకో ప్రాణమొచ్చింది..
స్త్రీ రక్తపు నదుల్లోకి దూకి
ఆత్మార్పణ చేసుకున్నపుడే
జాతికి విముక్తి…..
-గురువర్ధన్ రెడ్డి