నేటి తరానికి నేను సైతం
అంతరించిపోతున్న తరాల తోరణం
అలవోకగా మారిపోయే ఆచారం
కదిలెళ్లిపోయే అనంతమైన కాలం
ఇదే కదా నేటి సమాజపు విచిత్రం
తరాలు, మారినా యుగాలు గడిచినా మారని కాలం
మనుషుల మానసిక పరిస్థితి దారుణం
ఏ పరిస్థితులకు అయిన ఇట్టే క్రుంగిపోయే నేటి యువతరం
ధైర్యం కూడగట్టుకు బతకాలిగా
ఇదే నిజం
కాలం భ్రమింప చేసే వాస్తవాల సమాహారం
ఇదే కదా కాల చక్ర భ్రమణం
మరువకుమా నేటి సమాజం
అలవర్చుకో ఇదే నిత్య సత్యం!
నేటి తరానికి నేను సైతం!
– గాయత్రీభాస్కర్