నేటి స్త్రీ!
పెళ్లి కాని అమ్మాయిలా..
ఉన్నప్పుడే చాలా విలువ..
పెళ్లైయి ఇల్లాలినయ్యాక..
సమాజంలో స్త్రీకి ..
మహోన్నతమైన విలువే!
కానీ!
ఆ చేసుకున్న పతి దేవుడికి..
మాత్రం ఎప్పుడూ చులకనే!
నిర్లక్ష్యపు భావనే!
సతి అంటే చెప్పు కింద తేలులా..
అణిగి ఉండాలని అతని తీరు..
ఆ అహంకారపు మాటలే వేరు..
తన వాకిట ఓ అందమైన రంగవల్లియై..
ఆమెకంటూ ఏ కోరికలు లేక..
తన అవసరాలు తీర్చే ఆట బొమ్మయై..
ఉండాలని ఉంచాలని అతని కోరిక..
కానీ..
ఎంత కాలం ? ఎన్ని యుగాలు?
అలా ఉంటుంది ?
నేటి కాలం మగువ మారింది..
అతని నిర్లక్ష్యపు వాకిట ఉండనంటూ..
తన సత్తా చూపిస్తుంది నేటి స్త్రీ!!
-ఉమాదేవి ఎర్రం