నేటి సమాజం
సమాజం ఎటూ పాడయిపోతుంది. మనవరకు
మనం క్షేమంగా ఉంటే చాలని
అనుకునేవారు ఉన్నారు. అలా
కాకుండా నేటి సమాజం అంతా
బాగుపడాలి అని ఆలోచించే
వారు బహుకొద్ది మంది ఉన్నారు. సాహిత్య రంగంలో
కృషి చేసి సమాజానికి మేలు
చేయాలనే తలంపుతో అనేక
రచనలు చేసిన రచయితలు
మనముందున్నారు. కవులు,
రచయితలు సున్నితమైన
మనసు కలిగి ఉంటారు. వారు
సమాజంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకు స్పందిస్తూ ఉంటారు. అలా స్పందించే
కవులు,రచయితలు చాలా
మంది ఉన్నారు. ఎక్కువగా
వారే ప్రజలకు చక్కగా ప్రేరణ
కలిగిస్తూ ఉంటారు. మంచి
కధలు, కవితలను వ్రాసి
పాఠకులను ఆలోచింపజేసి
తద్వారా మన సమాజాన్ని
మేలుకొలుపుతూ ఉంటారు.
అలాంటి వారికి శతకోటి
నమస్కారాలు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
రచయితలే సమాజానికి మేలుకొలుపు.