నేతన్న
ప్రపంచానికి అందమైన వస్త్రాలను అందిస్తూ
మన అస్థిత్వానికి గుర్తింపు నిచ్చే చేనేత వస్త్రాలను ధరించాలని
నిండైన భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలు
వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని అనుకుంటూ
తన ఒంట్లో నరాలని దారాలుగా చేసి
చెమటని రంగుగా మార్చి చీరలు మార్చే వారు చేనేత కార్మికులు
ప్రతి ఒకరు చేనేత కార్మికులను పోత్సహించాలి
పోగును వస్త్రం గా మలిచి మనిషి మానాన్ని కాపాడుతూ
నేతన్న నీకు వందనాలు
నీ కళతో అందరి అబ్బురుపరిచావు
కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తావు
బంగారు తీగలతో చీరలు నేస్తావు
వారసత్వంగా ఈ కళన్ని నమ్ముకున్నావు
గిట్టుబాటు ధర లేకపోయినా ధైర్యంగా ఉన్నావు
నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న దాన్నే నమ్ముకొని
బ్రతుకుతున్నావు..
నేతన్న బతుకుబండి తిరగబడినప్పుడు
కులవృత్తి పొట్ట నింపలేనప్పుడు
ఇతర వృత్తులలో ఇమడలేక
స్వతంత్ర సంగ్రామపు భూమికై
విదేశీవస్తు బహిష్కరణకు దారిచూపిస్తున్నారు…
-మాధవి కాళ్ల