నేను ఒక మనిషిని
నా జీవిత ప్రయాణంలో
నా బాధ్యతలను నెరవేర్చుటకు
నన్ను నేను ఎప్పుడో మర్చిపోయాను.
జీవితం అనే సంగ్రామంతో పోరాడి
ఈ కాడులో ఒంటరిగా మిగిలిపోయాను.
నేలని నమ్ముకున్న నేను
పుస్తకాల్లో రారాజునయ్యాను
కానీ చుక్క నీరు కోసం
ఇప్పటికీ ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాను.
దేశానికి వెన్నెముక అని పిలవబడే నేను
పేదరికాన్ని దాటి నడవలేకపోయాను.
రెక్కల కష్టాన్ని నమ్ముకున్న నేను
కష్టం అనే యజమానికి బానిసనయ్యాను.
కోట్ల మంది ఆకలి తీర్చుతున్న నేను
ఆకలి అనే పదాన్ని మరిచి శ్రమిస్తూనే ఉన్నాను.
ఎన్ని ఎవరోధాలు వచ్చినా
ధరిత్రినే నమ్ముకుని ప్రయాణిస్తున్నాను,
ఈ ప్రయాణంలో అలసిన నేను
నా తల్లి ఒడిలో కలిసిపోవటానికి ఎదురుచూస్తున్నాను.
– కోటేశ్వరరావు