నేను నా నేస్తం
నాతో నేనే స్నేహం చేశా
హృదయం చిన్నగా నవ్వి
పలకరించింది
కంటి వెలుగు కరుణ తో చూసింది
నా కరములు ప్రేమ తో తల ను నిమిరింది
బాహ్యం లోని విశ్వాన్ని
నా లోపల చూసాను
నా శ్వాస నాలోని
అణువు అణువుని పలకరించింది
అంతా నాలోనే ఉంటే
ఒంటరి ఎలా అయ్యాను
ఆలోచనే మారింది
నిశ్వాస బహు దూరం
కాని వరకు…
శరీరం శ్వాస వేరు కాదు కదా
ప్రాణ శక్తినే అందిస్తున్న
నా నేస్తం…..
చివరి శ్వాస వరకు
మనం ఒకటే…
అందుకే నీవిచ్చిన బహుమానం
ఆమూల్య మైన ఆరోగ్యం, ఆనందం
అంది పుచ్చుకున్నా…
నా ప్రపంచానికి ఇచ్చా శాంతి
వెలుగుల ని
చల్లని చిరునవ్వుల
వెన్నెల వన్నెల పూలు
వెదజల్లుతూ…..
ప్రియమైన
స్నేహితులు అందరికి
శుభాకాంక్షలు
-అల్లాఉద్దీన్
Chala bagundhi..