నేనూ నా ఆవకాయ
మూడు పచ్చళ్ళు, ఆరు అప్పడాలు, రెండు చల్ల మిరపకాయలతో సంతోషంగా సాగుతున్న జీవితం లో డిప్రెషన్ అనే అక్క షుగర్ అనే చెల్లి తో వచ్చింది.తమ్ముళ్లు ఆయుర్వేదం తెచ్చి నా నోరు కట్టేసి,ఆహార అలవాట్లు మార్చారు ఆరోగ్యం అంటూ, మనకు లేనిది మిగతా వారికి ఎందుకని మనం అనుకుంటామా ? అనుకోము కదా? అందుకే ఏరికోరి కాయలు తెచ్చి పెట్టించాను. అందులోనూ మా చిన్న తమ్ముడికి, నాకు పచ్చళ్ళు అంటే ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా పచ్చడి ఉందా ? అని అడిగిన తర్వాతే భోజనం చేస్తాను,అలాంటిది కాయలు ఏరికోరి తీసుకువచ్చి, కొట్టించి, కడిగి మెత్తటి గుడ్డతో తుడిచి, అన్ని విధాలా అందిస్తే మన నోటికి వెళ్లకుండా చేస్తున్నారు చెల్లి ,ఇదెక్కడి న్యాయం,ఈ అన్యాయాన్ని అరికట్టే వారే లేరా చెప్పండి ? చెప్పండి ? చెప్పాం……. డీ 😭 సశేషం…
-భవ్యచారు
మామిడి కాయ పచ్చడి అప్పుడప్పుడు తింటే ఫరవాలేదు.