నేను మారను
నేను ఎవరికోసం మారాలి
నేను ఎవరికోసం నా నడక మార్చుకోవాలి
నాకు చావు అంటే భయం ఉన్నా
నేను ఎవరికోసం బ్రతకాలి
నేను ఎవరికోసం నిరీక్షించాలి
సమయం ఎవరికోసం ఆగదు
అలాగే నేను కూడా ఎవరికోసం ఆగను
నేను కాలంతో పరుగులు పెట్టాతాను…
నాకోసం నేను బ్రతుకుతా
నేను ఎవరికోసం మారాను
నాకు ఎవరి తోడు అవసరం లేదు
ఈ ప్రపంచంలో నా ప్రయాణం ఒంటరిగా సాగిస్తూ
ఎవరికోసం నేను నిరీక్షించకుండా
ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు కాబట్టి
నేను ప్రపంచంతో కలిసి నడవాలి అనుకుంటున్నాను..
ఎవరికోసం ఎక్కువగా ఆలోచించకుండా
వాళ్లకు నేను అలుసైపోకుండా
అందరితో స్నేహంగా మెలుగుతాను….
ప్రపంచంలో నేను ఒంటరిగా ఉన్నా
నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్లే…
నేను మారాను నాలాగే ఉంటాను…
-మాధవి కాళ్ల