నేను
మాటలు లేక కాదు,
మాట్లాడాలి అని లేక కూడా కాదు,
ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక కాదు,
మాటలు మదిలో పరిగెడుతూ ఉంటాయి,
ఆలోచనలు తడుతూనే ఉంటాయి,
పంచుకోవాలి అనే అనిపిస్తుంది,
కానీ సందేహం అన్నిటినీ మౌనంగా మార్చేస్తుంది.
భయం పదాన్ని పెదాల్లోనే ఆపేస్తుంది.
ముందు నుండి ఇలా లేను,
ముందులా ఇప్పుడు లేను.
గలగల మాట్లాడే నేను,
ఇప్పుడు మౌనాన్ని ఎంచుకున్నాను.
ఎదురైన అనుభవాలు,
కలిసిన మనషులు,
ఇలా నన్ను మౌనంగా ఉండేలా చేశాయి.