నేనివ్వను
నాది నాకిచ్చెయ్! అన్నాడు రాము..
నేనివ్వను అంటూ బుంగ మూతి పెట్టింది రోజా!
ఇవ్వనంటె ఎలా? నేను నీ కిచ్చాను కదా! అన్నాడు రాము కోపంగా!
నువ్విచ్చింది నేను ఎప్పుడో మింగేసా! అంది అంతే కోపంగా రోజా!
నువ్వు మింగేస్తే నాకేంటి? నాకిప్పుడు కావాలంతే!
అన్నాడు మెుండిగా రాము..
ఇదిగో! తీసుకో! అంటూ దగ్గరగా వచ్చి ముఖాన్ని రాము ముఖానికి ఆనించింది..
వాడు గట్టిగా గిల్లేసాడు ముద్దుగా కొరికేసాడు కూడా!
ఏడుస్తూ పరిగెత్తుకు వెళ్లి పోయింది అయిదేళ్ల రోజా!
చాక్లెట్ కోసం ఇదంతా చేసాడు యేడేళ్ల రాము..
మీరు ఇంకేమెా అనుకున్నారా? కాదండి బాబోయ్!
హాస్యానికి రాసానంతే!!
-ఉమాదేవి ఎర్రం..