నీటిబొట్టు
నీటిబొట్టు గురించి చెప్పాలంటే నీతిగా నీరును
పొదుపు చెయ్యాలి మనం
ఎందుకంటే ప్రతినీటిబొట్టు
ప్రాణాధారమైన బిందువు
ఒక్కొక్క చుక్క నీటి బొట్టే
జీవనానికి ఆధారం. ఒక్క
నీటిచుక్కే జలసంపదగా
మనకు జీవామృతం అవుతుంది కాబట్టి
“జలమే మన శక్తి”
భూమి , నీరు ఎంత శాతం
విశ్వంలో వుందో మా శరీరంలో కూడా అదే రీతిలో
వుంది . శరీరంలో నీటిశాతం తగ్గితే మనం
నిస్సహాయంగా అవుతాం
జీవక్రియలు జరగడానికి నీటి బొట్టువిలువ ఎంతవుందో చూడండి.
ప్రకృతిలో ఆహారం, నీరు
ప్రతి జీవరాశికి ప్రాణాధారం
ఆహారము భూమి నుండి రావడానికి నీటి అవసరం
కదాఅందుకే సహజ వనరులు కరిగిపోకండా
కాపాడుకోవాలి అదే మన
ముందున్న తక్షణ కర్తవ్యం
ప్రకృతి సమతుల్యంగా వుండి సస్యశ్యామలంగా
వున్నంత వరకు జీవనా దారమైన నీటిని “పొదుపు”
గా వాడటటం ఆచరణలో కి
తెచ్చి వర్షపు నీటిని భూమి
లోకి వెళ్లేలా చేస్తే జల సంపద పెరుగుతుంది
కరువు కాటకాలు రాకుండా
జీవనాధారమైన నీటిని
మంచి ఆలోచనతో వృధా కాకుండా కాకుండా ఒడిసి
పట్టుకోవాలన్న కర్తవ్యం.
సమృద్దిగా దొరికే నీటిని
డబ్బిచ్చి కొనే స్థితికి వచ్చాము
ముందురోజు ల్లో ఇంకా నీటిబొట్టు నిర్జీవం కాకుండా చూడాలి.
జల యుద్దాలు లేకుండా వుండాలంటే ఇప్పుడే కళ్ళు తెరవాలి మరి
“మనిషి జీవితం నీటి బొట్టు” లాంటిది ఆలుచిప్పలో పడిన స్వాతి
చినుకు ముత్యమైతే సముద్రములో పడ్డ నీటి
బొట్టు ఉప్పుగా మారుతుంది
నీటిని పొదుపుగా వాడినవారు “డబ్బు”
ఆదా చేస్తారు అని పెద్దల మాట. ఎక్కువ సంపాదించడం కన్నా తక్కవగా ఖర్చు చేయడం
గొప్ప విషయం అది ప్రతి నీటి బొట్టు కు వర్తిస్తుంది.
భావితరాల లో భగీరథుడు
పుట్టక పోయినా లేకున్నా
అమూల్య మైన ప్రతి నీటి
బొట్టు ఉప్పగా మారక ముందే ఉలిక్కి పడాలి
లేకుంటే కన్నీరు కూడా
లెక్క కట్టాలి మరి ……..
– జి జయ