నీ తోనే
నీతోనే నేతోనే ఈ ప్రపంచం
నీతోనే లోకం నీతోనే జనం
ఎవరా అంటే డబ్బు జబ్బు
నీతోనే కష్టం నీతోనే సుఖం
నీతోనే లోకం మాయచేస్తుంది
నీతోనే నిన్ను శాసిస్తుంది
నీతోనే అన్ని పనులు చేయిస్తుంది
నీతోనే ఆధారం అందుతుంది
నీతోనే నిద్ర లేకుండా చేస్తుంది
నీతోనే అన్ని ఆటలడుతుంది
నీతోనే వుంటూ నీకు అర్థంకాదు అదే డబ్బు
నీతోనే నిజాయితీ లేదు అంటుంది
నీకే ఓర్పు నేర్పు చూపిస్తుంది
నీతోనే వుంటూ నీతిని
పోగొడుతుంది
నీతోనే మనుషులు లోబులు అవుతారు
నీతోనే అన్ని నేర్చుకుంటారు
నీకే పాఠం గుణ పాఠం
నేర్పిస్తుంది
నీతోనే రోగాలు వస్తాయి
నీతోనే రోగాలు పోతాయి
నీతోనే భోగాలు
నీతోనే నీ విలువ తెలిసేలా
చేస్తుంది
నీకు నటన నేర్పుతుంది
నీతోనే గర్వం పెరుగుతుంది
అంతా రంగుల ప్రపంచాన్ని
ఆడించి నీతో రాను అని
చెప్పి నన్ను సృష్టించిన
మనిషికి బుద్ది లేనివాళ్ళు
గా తయారు చేస్తుంది .
డబ్బు జబ్బు నీతో చేసే భాస? మరి
– జి జయ