నీరు కారిన రైతుగుండె

నీరు కారిన రైతుగుండె

రైతే రాజు రైతే దేశానికి వెన్నముక అనేవి పదాలుగానే మిగిలాయా !

ఆకలి తీర్చే అన్నదాతకు
అన్నమో రామచంద్ర అనే
పరిస్థితులు ?

నేల తల్లినే నమ్మి రైతుకు
ఎంత కష్టం ఎంత కష్టం

ఆరుకాలపు పంటకు
అన్ని అడ్డంకులే కదా?

అదిక దిగుబడి అని
విత్తనాల కల్తీ?

భూమి సారంకోసం అంటే
ఎరువుల కరువు ?

నీరు నిండుగ ఉంటదంటే
కరెంటు కష్టాలు?

లబ్ది కోసం ఆశ లేక చేసిన
పెట్టుబడి కష్టం ?

పంట ఏపుగా చూద్దామంటే
పురుగు మందుల కష్టం?

నీరు నిండుగ పోస్తనంటే
వరుణ దేవుడి కరుణ కష్టం?

వారసత్వం వదులుకోక
పుడమి పోరాటం అంటే?

పంటచేతికి వచ్చేనంటే
ప్రకృతమ్మ చేసె చేటు?

సమస్యలు ఎన్ని ఉన్నా
సర్దుకుంటే పంట కొనుట
గగనమాయే?

అన్నికలిపి కుప్పబోస్తే
దళారులమోసమాయే?

బక్కచిక్కి బతుకు
భారమాయే వ్యయంతో?

కొత్త పంటలు వస్తున్నా గానీ రైతు గుండె నీరు
కారడం తప్ప మరొక్కటి
లేకపాయే?

అన్నదాతలు వలస కూలీలుగా మారిపోతే
దేశ భవిష్యత్తు కష్టం?

డిజిటల్ ఇండియా కన్నా
రైతు నేస్తమే గొప్పదనం

అప్పుడే అందరికీ అందుతాయి మెండుగా
మెతుకులు….?

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *