నీ రాక
నిన్ను ప్రేమించే ఒక మనిషి
ఇక్కడ ఉంది అనే విషయాన్ని
నువ్వు మర్చిపోయావా…
నీ రాక ఎన్నో రోజులుగా
ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా..
మనం కలిసి ఉన్నంత కాలం గొడవలు
పడుతూ కాలాన్ని మార్చిపోయాము..
కారణాలు ఏవి అయిన నువ్వు నన్ను
వదిలి దూరంగా వెళ్ళిపోయావు..
నీకై నా ఎదురు చూసే నీ నేను గా
నీ జీవితంలో మిగిలిపోతాను…
- మాధవి కాళ్ల