నీ కోసమే ఓ సఖీ
గతించిన వసంతం మరలా వస్తుందని..
పూలను రాల్చిన చెట్టు మరలా చిగురిస్తుందని..
పచ్చని చిలుక చెలిమి కోసం..
కొమ్మల మధ్యన నే వేచి ఉన్నా..
ఒంటరి గోరింకనై ఇన్నేళ్లుగా..
నీ కోసమే ఓ సఖీ.
ఎన్నటికీ రావని తెలియక..
ఇన్నాళ్లూ ఆశలు సజీవంగానే ఉన్నా..
ఇప్పుడెందుకో గుండెను ఏదో వేదన గుచ్చుతున్నట్టుంది..
స్వచ్ఛమైన నా మనసు నువ్విలా కష్టపెడుతుంటే తట్టుకోలేనంటోంది…
నువ్ నాతో ఉన్నప్పుడు నీ ప్రేమను నిలపుకోలేకపోయా
ఇప్పుడు నువ్ నాక్కాకుండా పోతుంటే ఆపలేకపోతున్నా..
ఈ శిక్షకు నన్ను నేనే నిందించుకోవడం తప్ప నిన్నేమనగలను.
ఏళ్ల క్రితం ఇంకిపోయిన కన్నీరెందుకో రెప్పల మాటున దాగలేక మరలా ఉబికివస్తోంది..
ఇదే నిజమైన ప్రేమని ఆ ధారలు చెబుతున్నా..
వాటి మౌన ఘోష వినేందుకు నా సఖి సిద్ధంగా లేనంటే..
నే నేం చేయగలను.
ఇది కవిత్వమో..లేక నా రచనా నైపుణ్యమో కాదురా..
ప్రతి అక్షరం మనసు లోతుల్లోని ప్రేమ భావాల్లో నుంచి పుట్టుకొస్తోంది..
నమ్మకమేమిటని అడగకు..
నువ్ నా ప్రాణమిమ్మని అడిగినా కాదనను.
ఇన్నాళ్లూ ఏమయ్యావనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉన్నా అది నున్ నమ్మవని తెలుసు అయినా నిజమైన ప్రేమకు ఎన్నటికీ అంతం లేదు..
మరణం తప్ప నా నుంచి నీ తలపులను మరేదీ దూరం చేయలేదు.!
– ది పెన్