నటకిరీటి రాజేంద్రప్రసాద్
ఆయన నా అభిమాన నటుడు,ఆయన పండించే హాస్యం అధ్బుతం,ముఖ్యంగా ఆయన నటించిన
“ఆ ఒక్కటి అడక్కు” చిత్రంలో కొన్ని సంభాషణలు ఎంత చమత్కారం గా వుంటాయంటే ఇప్పటి చిత్రాలలో అలాంటి సంభాషణలు చాలా అరుదు, మచ్చుకు కొన్ని “వేశావులే దోశ”,”కోశావులే కాకరకాయ”,గీశావ్ లే గడ్డం లాంటి సంభాషణలు నాకు చాలా ఇష్టం… అప్పటి వరకు హాస్య భరితమైన చిత్రాలలో నటించిన ఆయన “ఎర్ర మందారం” చిత్రంలో కాస్త గంభీరమైన పాత్రలో నటించాడు, తర్వాత ఆయన నటించిన “ఆ నలుగురు”,”మీ శ్రేయోభిలాషి” లాంటి అద్భుతమైన చిత్రాలకు గాను ఆయన నటనకు ఎన్ని పురస్కారాలు ఇచ్చిన తక్కవే, అలాగే గాలి సంపత్ చిత్రంలో గాలి భాష మాట్లాడటం ఆయనకే చెల్లింది అంతటి గొప్ప నటుడు మన తెలుగు వాడు అవ్వడం గర్వకారణం, ఇప్పటి తరంలో jr NTR చాలా ఇష్టం సరైన కథ పడితే jr NTR నటించలేనిది అంటూ ఏమి లేదు అని నా అభిప్రాయం ఈ తరం నటుల్లో చాలా గొప్ప నటుడు jr NTR…..
-అశోక్