నన్ను నడిపించే కల
కన్నాను నిదురలో నన్ను నడిపించే కలను,
కంటునే ఉన్నాను ప్రతీ రోజు ఒకే కలను,
కానీ అవి దాటి వెళ్ళిపోతూనే
ఉన్నాయి నా కన్నులను,
అయినా కూడా నేను అసలు విడువను,
నా కలను అడ్డుకున్న వారిని
నా అయినా వారిని ఎందరినో వదిలేసాను,
నేను అనుకున్నది సాధించి తీరతాను,
అనుకున్న దానికన్నా ఎక్కువే కష్టపడుతాను
అంతే కానీ ఏ నిముషము
కూడా ఓటమిని ఒప్పుకునే ఒప్పుకోను,
నేను తీసుకున్న నిర్ణయాల మీద నిలబడతాను,
అడదానిని అయినా కూడా పురుషునకు
ఏ మాత్రం తీసిపోను,
నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న కలకు,
తగిన సత్కారం దొరికే దాకా వీశ్రమించనే విశ్రముంచను,
నా కలలో నేను రాసిన రచనలకు కవితలకు పొందిన పొందిన ప్రశంసలను, పొగడ్తలను, నిజంగా అనుభవించి అనుభూతి చెందే దాకా నేను పట్టిన పట్టును,
విడువనే విడువను, కచ్చితంగా రచయిత్రి, కవయిత్రి అయ్యి తీరుతాను,
మాటిస్తున్నాను నా జీవితానికి నేనే మాటిస్తున్నాను,
సాధిస్తాను నేను కన్న కలను కచ్చితంగా సాధిస్తాను…
-అశోక్