నాన్న వెళ్ళిపోయాడు

నాన్న వెళ్ళిపోయాడు

మా నాన్న వెళ్ళిపోయాడు. శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అందనంత దూరాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అని నేను ప్రతి రోజూ బాధ పడుతూనే ఉండేవాణ్ణి. ఒక రోజు కలలో కనపడ్డాడు. “నువ్వు ఎందుకలా బాధ పడుతున్నావు. నేను నీ హృదయంలోనే ఉన్నాను. నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను.” అన్నాడు.

మాట నిజం. నాన్న నన్ను విడచి వెళ్ళగలడా. నా నీడలా నా తోనే ఉంటాడు. నా తోనే ఉంటాడు. ఆయనే నా ఊపిరి. ఇప్పుడు నా పిల్లలకు నేను నాన్నని. మా నాన్న నాకు పంచిన ప్రేమని నేను నా పిల్లలకు ఇవ్వాలి. అదే నా ఆశయం. అదే నా ఆకాంక్ష.

– వెంకట భానుప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *