నాన్న ప్రేమ
నాన్న ఎంతో కష్టపడినా తన కష్టం తెలియకుండా
మాకు ఎలాంటి లోటు లేకుండా చూస్తుకున్నారు..
నాన్న అంటే నాకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చేవాడు
నాన్న నువ్వే నాకు మొదట స్నేహితుడు
నా తప్పు ఒప్పులను సరిచేసి నడిపేవాడు
నా సమస్యకు పరిష్కారం చెప్పే మార్గదర్శకుడు
నా గెలుపు కోసం ఆరాటం పడేవాడు
నా ఓటమికి తోడుగా నిలిచిన వాడు
నువ్వు నా ప్రక్కన ఉంటే నాకు అదో ధైర్యం
నేను పడిన ప్రతిసారి తట్టి లేపి నడిపించే వాడు
నువ్వు ఆ పని చేయగలవు అని ధైర్యం చెప్పేవాడు
అల్లరి చేస్తే భరిస్తూ , ముద్దు చేస్తూ సంస్కారాన్ని , విలువల్ని నేర్పిస్తావు..
నాన్న నాకు నీ ఆశీర్వాదాలు ఇచ్చేవాడు.
ఇంత చేసిన నా నుండి ఏం ఆశించకుండా ఉండేవాడు
నాన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే
మనసులో బాధన్ని అణిచి పెట్టుకొని
కష్టం దరి చేయకుండా కవచంలాంటి వాడు నాన్న..
ప్రేమకు ప్రతిరూపం లాంటి వాడు నాన్న
ప్రపంచానికి చెప్పే తత్వం లాంటి వాడు నాన్న
సమయం సరిపోకపోయినా
సంతోషం దరిచేరకుండా
కష్టం ముంచుకొస్తున్న
నష్టం వచ్చినా
చెరగని చిరునవ్వుతో
కదలని మనసుతో ఉంటాడు నాన్న…
కనిపించే దైవం అమ్మ అయితే
కనిపించని ఆ దైవం నాన్న
నాన్న అంటే త్యాగం
నాన్న అంటే బాధ్యతతో కూడిన ప్రేమ
నాన్న ప్రేమ అంటే ఎంతైనా శిఖరం…
-మాధవి కాళ్ల