నాన్న బాటలో నేను
మా నాన్న ఉపాధ్యాయుడు.
నేను కూడా ఉపాధ్యాయుడినే.
ఆయనకు పుస్తకాలంటే ప్రీతి.
పుస్తకాలు చదవడం నా హాబీ.
ఆయన రచనలు చేసేవారంట.
నేనూ రచనలు చేస్తుంటాను.
కొత్త విషయాలు తెలుసుకోండి.
పిల్లలకు మంచిని బోధించండి.
ఏ పనైనా శ్రద్ధగా చేసేయండి
అని మా నాన్న చెప్పిన మాటలే
నేడు మాకు అనుసరణీయం.
అందరికీ అమ్మ తొలిగురువైతే
నాకు మా నాన్న తొలిగురువు.
జీవితానికి తొలిమెట్టు నాన్న.
ప్రపంచంలో బ్రతకటం నేర్పారు.
విద్యాబుద్ధులెన్నో నేర్పించారు.
ఎంతో ఆదర్శంగా నిలిచారు.
జీవితంలో ఎలా మసలాలో
చూపెట్టింది మా నాన్నగారు.
సదా నా మనసులో ఉంటారు.
ఆయన బాటలో నేను పయనిస్తున్నాను.
-వెంకట భానుప్రసాద్ చలసాని
అమ్మానాన్నల ఆశీస్సులు అందరికీ కావాలి.