నాన్న

నాన్న

ఈ రోజు నాన్నగారి తిథి, ఆయన తనకుటుంబం అంటే అక్కా, చెల్లెళ్ళకోసం బ్రతికాడు, తమ్ముళ్ళు ను చదివించాడు. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పదవులు దక్కేలా కృషి చేశారు.

ముఖ్యంగా గిరిజనులకు చదువు రావాలని తండాలకు వెళ్లి చదువు నేర్పించి, ఆర్మీ ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. ఎంతో మందికి విద్యాదానం కాకుండా, ఆర్థిక సాయం కూడా చేశారు.

ఎప్పుడూ ఎవరు ఎంత రాత్రి వచ్చినా అన్నం పెట్టే పంపారు. ఆయనకు తగ్గ ఇల్లాలు అమ్మ, యే రాత్రి ఎవరికీ వండి పెట్టమన్నా విసుక్కోకుండ వండి కడుపు నిండా పెట్టేది. నాన్నగారు అమ్మను కూడా చదివించారు.

అమ్మ డిగ్రీ వరకు చదువుకుంది. ఒక చిన్న పాఠశాల కు ప్రిన్సిపాల్ కూడా అయ్యింది. మేము ఆమె దగ్గరే చదువుకున్నాం. ఆయన చదువు నేర్పిన విద్యార్థులు ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నారు.

మాకు ఆయన చెప్పింది, నేర్పింది ఒక్కటే నువ్వు నిజాయితీగా ఉంటే విజయం నీ సొంతం అని, నీకు ఎవరైనా హాని చేస్తే వారిని ఒక్కమాట కూడా తిట్టకూడదు అని, ఆకలితో వస్తె శత్రువుకు అయినా అన్నం పెట్టమని, ఇన్ని విలువలు కల నాన్న దూరమై మాకు బాధని మిగిల్చారు.

నువ్వే ఇంటికి పెద్దకొడుకు అంటూ బాధ్యత అప్పగించి వెళ్ళారు. నాన్న నువ్వు దూరమైనా మా మనసుల్లో మా ప్రతి పనిలో మాతోనే ఉంటావు. నీ మంచితనము మమల్ని కాపాడుతుంది.

నీ వల్లే ఈ రోజు తినగలుగుతున్నాం. నువ్వు చేసిన మంచే మాకు ఫలానా వారి పిల్లలు అనే పేరును నిలబెట్టింది. ఇప్పటికే మళ్లీ ఎక్కడో పుట్టే ఉంటావు. తినే ప్రతి మెతుకు లోనూనిన్నూ తల్చుకుంటూ,

ప్రత్రి రాత్రి నువ్వునేర్పిన పద్యాలు, శతకాలు, గుర్తు చేసుకుంటూ నీ నామ స్మరణలో నిత్యం పూజిస్తూ, చేసే ప్రతి పనిలో నిన్ను ఆదర్శంగా తీసుకుంటూ, తోచిన సాయం చేస్తూ,

నీ పేరు నిలబెట్టాలి అనే ప్రయత్నం లో ఉన్నాము. మాలక్ష్యాలూ నెరవేరాలని ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు అనే నమ్మకం తో  ఓం శాంతి. 

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *