నాన్న
నాన్నా అంటూ నాన్న పిలువు
తనని నాన్న అని పిలవగానే
మైమరచి పోయే నాన్న ఆ ఒక్క
పిలుపు కోసం బిడ్డను కంటి రెప్పలా
ఏ కష్టం దరి చేరకుండా కాపాడే నాన్న
తను తినే అన్నం లోంచి మెతుకులు తీసి
అన్న ప్రసాన చేసే నాన్న, తన కంచం లాగుతుంటే
నవ్వుతూ చూసే నాన్న వీడు అప్పుడే నా నోరు
కొడుతున్నాడు అంటూ జరగబోయే రోజులను
కూడా ఆలోచించ గలిగే నాన్న, బిడ్డ కోరాడు అని
అయిదో తరగతి లోనే సైకిల్ కొనిచ్చి, నేర్పించే నాన్న
వాడి ఉన్నతీ కోసం తన జీవితాన్నీ,
శక్తినీ ధార పోసి పెంచే నాన్న
ప్రేమ బాధ్యత అంటూ గుర్తెరిగి ఇంటికి, తన అర్ధాంగి కి
పిల్లలకు రక్షణ కవచంలా నిలిచే నాన్న, కోపాన్ని, సంతోషాన్ని
పక్కన పెట్టి, అన్నిటికీ నవ్వుతూ సమాధానం చెప్పడం నేర్చుకున్న నాన్న,
చదువు కోసం తనకు ఇష్టమైన పొలాన్ని కూడా తాకట్టు పెట్టే నాన్న నీకెందుకో భారమయ్యాడు ఈ వేళ,
ఆయన తినే కంచాన్ని లాగిన నువ్వు ఆయనకు కడుపు నిండా తిండి పెట్టలేక విసుక్కుంటూన్నావు,
తన పొలాన్ని తాకట్టు పెట్టి నిన్ను చదివించిన నాన్న ఈ రోజు షర్ట్ బాగా వేసుకోలేదని చిరాకు నీకు,
నువ్వ లాక్కున్న తన కంచాన్ని చూసి నవ్వుకున్న నాన్న కు
ఈ రోజు నువ్వు కాసేపు మాట్లాడితే చాలు అన్నా సమయం లేదని విసుక్కుంటూ తిడుతున్నావు,
నీ మల మూత్రాలను కడిగిన నాన్న ఈ రోజు లేవలేని స్థితిలో ఉంటే చిరాకు పడుతున్నావు,
నువ్వు కూడా ఒక నాన్నయ్యావు అనే విషయాన్ని మర్చిపోతూన్నావు…..
– భవ్య చారు