నందిని

నందిని

నందిని అమ్మా నందిని అన్ని సర్ధుకున్నవా అంటూ తల్లి సుజాత పిలిచేసరికి, హా సర్దుకున్నాను అమ్మా అంది నందిని. సర్లే అక్కడ జాగ్రత్తగా. ఉండమని నేనేం చెప్పను. ఎందుకంటే నువ్వేం చిన్న పిల్లవు కాదు.అన్ని తెలిసిన దానివి కాబట్టి నీకేమీ చెప్పలేను. నిన్నేమీ అనలేను అంటూ జాగ్రత్తగా పంపించింది సుజాత నందిని.

అమ్మ వెళ్ళేది ఎంత దూరం? హైదరాబాద్ ఏ కదా రెండు గంటల్లో మళ్లీ నా దగ్గర ఉండొచ్చు. నువ్వు అంటూ అమ్మను దగ్గరికి తీసుకొని గట్టిగా ఒకసారి కౌగిలించుకొని బాయ్ అంటూ వెళ్ళిపోయింది నందిని.

ఏంటో ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లనే కానీ ఈడపిల్ల కాదు. అమ్మాయి అంటే ఇంత ఇష్టం ఉన్న ఇంట్లో ఉంచుకోలేను, అలాగని పంపించను లేను. తను స్వతంత్రంగా బ్రతకాలి, సమాజాన్ని చదవాలి, ఉద్యోగం చేస్తూ సొంతంగా సంపాదించుకొని ఎలా పొదుపు చేయాలో నేర్చుకోవాలి. రేపు పొద్దున పెళ్లయితే ఇల్లు ఎలా చూసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే దూరం పంపించక తప్పడం లేదు, అంటూ కళ్ళు ఓత్తుకుంది సుజాత.

భర్త లేకపోయినా కాలేజీ లెక్చరర్ గా పని చేస్తూ పిల్లని చదివించుకుని, ఇప్పుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి పంపించింది. తనకు అన్ని తెలిసి రావాలని ఇలా దూరంగా పంపింది.

***

ఆరు నెలల తర్వాత నందిని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది.పక్కనే తల్లి సుజాత తన వైపే చూస్తూ కూర్చుంది. ఏంటమ్మా ఇలా ఎంత సేపు చూస్తారు. వెళ్ళండి వెళ్లి రేపు మళ్లీ రండి మూడు నెలల నుండి సృహలోకి రానిది. ఈ రోజు వస్తుందా ఏమిటి ? అయినా ఈ పిచ్చి వాళ్ళ నీ నమ్మలేం, కానీ మీరు వెళ్ళండి అంది నర్స్ అసహనంగా , పిచ్చి అనగానే సుజాత ఒక్కసారిగా లేచి, ఆ నర్స్ నీ ఒక్క దెబ్బ వేసి పిచ్చా, నా కూతురికి పిచ్చి అంటావా, నీకెంత ధైర్యం. నా కూతురు పిచ్చిది కాదు అంది. పిచ్చిది కాదు అంటే మరి పిచ్చాసుపత్రికి ఎందుకు తెచ్చినట్టు అంది చెంప రుద్దుకుంటూ నర్స్.

అవును ఎందుకు తెచ్చాను. ఛా నాకసలు బుద్ది లేదు. నా కూతురు పిచ్చిది కాదు .నాకెందుకు ఈ ఆలోచన రాలేదు అనుకుంటూ గబగబా డాక్టర్ వద్దకు వెళ్లి సర్ మా అమ్మాయిని నేను తీసుకు వెళ్తున్నా అంది. అదేంటమ్మ పిచ్చి ఇంకా నయం కాలేదు. తాను సృహాలోకి రాలేదు కదా , పైగా నీకు ఏ సమయానికి ఏ మందులు ఇవ్వాలో కూడా తెలియదు కదా అమ్మ అన్నారు డాక్టర్ గారు. 

డాక్టర్ నా కూతురు పిచ్చిది కాదు. నాకే బుద్ధిలేక నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. ఈ మూడు నెలల్లో ఏ సమయానికి ఏ మందులు ఇవ్వాలో అన్ని తెలుసుకున్నాను. నా కూతురు నేను చూసుకోగలను. కానీ నాకు ఒక ఫేవర్ చేస్తారా అంటూ అడిగింది సుజాత.

ఏంటమ్మా చెప్పండి అన్నాడు డాక్టర్ గారు. నా కూతుర్ని ఇక్కడికి తీసుకు వచ్చింది ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అని అనగానే, చెప్తాను అమ్మ అంటూ డాక్టర్ గారు ఫైల్స్ చెక్ చేసి ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న వనవిహార్ అనే అపార్ట్మెంట్స్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మీ అమ్మాయిని మొదట తీసుకువచ్చాడు. మా అమ్మాయి ఏ పరిస్థితిలో వచ్చింది డాక్టర్ గారు అన్నది సుజాత.

ఏమీ లేదన్న స్పృహలో లేని స్థితిలో వచ్చింది. అంతా బాగానే ఉంది బలత్కారం లాంటివి ఏమీ జరగలేదు. కాకపోతే బాగా భయపడ్డట్టుగా అనిపించింది. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా తన అపార్ట్మెంట్ ముందు పడి ఉన్న మీ అమ్మాయిని చూసి గబరా పడి ఇక్కడికి తీసుకువచ్చాడు. అంతే ఆ తర్వాతే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్నారు డాక్టర్ గారు.

సరే డాక్టర్ గారు మాకు డిశ్చార్జ్ లెటర్ ఇవ్వండి, అలాగే ఆ అడ్రస్ కూడా అనగానే డాక్టర్ గారు ఒక కాగితం పై అడ్రస్ రాసి ఇచ్చారు. అలాగే డిశ్చార్జ్ చేశారు. సుజాత బిళ్ళంతా కట్టేసి సృహలో లేని తన కూతుర్ని ఒక ఆటో మాట్లాడుకొని ఆ ఆటో అతనికి అడ్రస్ చెప్పింది.

అడ్రస్ ప్రకారంగా ఆటో వెళ్లి వనవిహారం అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. ఆటోని చూడగానే సెక్యూరిటీ గార్డు గబగబా పరిగెత్తుకు వచ్చాడు ఎవరండీ మీరు అంటూ, ఆ తర్వాత ఆటోలో ఉన్న నందిని చూసి, ఓ ఈ అమ్మాయి గారా, మీరు అమ్మగారు అమ్మ రండి ,రండి మీ ఫ్లాట్ అలాగే ఉంది. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అమ్మ ఐదు నిమిషాలు ఇక్కడే ఉండండి తుడిపిస్తాను అన్నాడు.

పరవాలేదు తాళాలు ఇవ్వండి నేను తుడుచుకోగలను, అంటూ సెక్యూరిటీ గార్డు సహాయంతో నందిని తీసుకొని ఫ్లాట్లు లోకి వచ్చింది సుజాత. అమ్మ ఇదిగో ఈ నెంబర్ తీసుకోండి, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అంటూ సెక్యూరిటీ గార్డు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు.

అప్పటికి సమయం ఆరు గంటలవుతుంది. సుజాత ఇల్లంతా ఒకసారి చూసింది ఒక హాలు కిచెన్ రెండు బెడ్రూమ్ లు ఉన్న అపార్ట్మెంట్ అది. మూడు నెలలు ఎవరూ లేకపోవడంతో దుమ్ము పట్టి పోయి ఉంది. సుజాత గబగబా ఇల్లంతా పూడ్చి తుడిచేసింది. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లేసరికి గిన్నెలన్నీ ఎక్కడ అక్కడే పడిపోయి ఉన్నాడనితో అవన్నీ తోమేసి నీటిగా సర్ధి పెట్టింది.

ఒక బెడ్ రూమ్ లోకి వెళ్లి బిడ్డ దులిపి తాను తెచ్చిన బెడ్ షీట్స్ నీటుగా సర్ది అప్పటివరకు హాల్లో పడుకోబెట్టిన స్పృహలోని నందిని తీసుకోవచ్చి బెడ్ రూమ్ లో  పడుకోబెట్టింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న రవ్వతో జావకాచి, కొంచెం కొంచెం గా కూతురికి తినిపించింది. తాను అదే రవ్వను ఇంకొంచెం గట్టిగా చేసుకుని తినేసింది.

ఇదంతా అయ్యేసరికి రాత్రి 9:00 అయింది. ఇంట్లో సామానంతగా లేదు ఒక రవ్వ తప్ప రేపొద్దున కొంచెం సామాను తీసుకురావాలి. అని అనుకుంటూ కూతురి పక్కనే కింద చాప వేసుకుని పడుకుంది సుజాత. బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారింది సుజాత.

చల్లగా గాలి రావడంతో అంత చలిలో చల్లగా అనిపించడంతో మెలుకువ వచ్చింది సుజాతకి, ఏంటి ఇంత చలిగా ఉంది. నేను ఫ్యాన్ కూడా వేయలేదు కదా అని అనుకుంటూ మెల్లిగా కళ్ళు విప్పిన సుజాతను మొహంలో మొహం పెట్టి చూస్తోంది నందిని. కెవ్వుల కేక పెట్టి గబుక్కున లేచి కూర్చుంది. నందిని లేచి అలాగే చూస్తూ లే లే లే లే అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళు వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇది నా గది నా గదిలోకి ఎందుకు వచ్చావు వెళ్తావా లేదా అంటూ సుజాతను చూస్తూ తనని భయపెట్ట సాగింది.

చుట్టూ చీకట్లో రెండు కను గుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ గదిలో తను నందిని తప్ప మరెవరూ లేరు. బయట నుంచి ఎవరూ వచ్చే ఆస్కారం లేదు. అది కాదు సుజాత ఆలోచిస్తుంది. నందిని లేచి ఇలా అరవడం తనకి ఆశ్చర్యంగా తానెవరో తెలియనట్లుగా మాట్లాడడం. ఇంకా ఆశ్చర్యంగా ఉంది. లైట్ వెయ్యాలని అనుకొని స్విచ్ బోర్డ్ ఎక్కడుందో మెల్లిగా గుర్తుకు తెచ్చుకోసాగింది..

ఆ వైపుగా వెళుతూ మెల్లిగా పాక్కుంటూ వెళ్లి గోడకు అనుకొని నిల్చొని లైట్ వేసింది. ఆశ్చర్యం నందిని ఎప్పటిలా పడుకొనే ఉంది. బెడ్ పైన చుట్టూ ఎవరూ లేరు. ఇదేంటి తను పీడకల కందా ఇప్పటివరకు తన భయపెట్టిన నందిని నిశ్శబ్దంగా తను ఎలా పడుకోబెట్టిందో అలాగే ఉంది. ఇక్కడ ఎవరూ లేరు అని అనుకుంటూ మొహానికి పట్టిన చెమటలు కొంగుతో తుడుచుకొని నీళ్లు తాగి మళ్లీ లైట్ ఆఫ్ చేసి ఎప్పటిలా పడుకుంది సుజాత.

ఏంటే వెళ్ళమంటే మళ్ళీ పడుకున్నావ్ లేస్తావా, లేదా వెళ్తావా లేదా, అంటూ సుజాత చెంపలు చెల్లు చెల్లుమంటూ వాయించింది నందిని. ఈసారి కెవ్వు నా కేక పెట్టి లేచి కూర్చొని బయటకు పరిగెత్తింది సుజాత తలుపు తీసుకొని, ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఒక్కసారిగా… హాల్లోకి వచ్చిన సుజాత సోఫాలో కూర్చుంటూ చెమటలు తుడుచుకుంటూ, ఆలోచించసాగింది. ఏంటిది ఎవరు అసలు ఎవరు ఆ రూమ్ లో నుంచి వెళ్ళమన్నారు. నందిని అయితే అలాగే పడుకుని ఉంది వెళ్ళమని అనేవాళ్ళు నందిని ని కూడా పంపించాలి కదా, కానీ నందిని అంటే కదలని స్థితిలో ఉంది, అలాంటిది ఎలా లేచింది. ఎలా తనని వెళ్ళగొట్టిందో అర్థం కాలేదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది సుజాత నిద్రపోకుండా, పైగా నందినికి ఏమైనా అవుతుందేమోనని భయంతో అలాగే కూర్చుంది.

తెల్లగా తెల్లారింది. నిద్రపోని సుజాత మెల్లిగా నందిని గదిలోకి వెళ్ళింది. అప్పటికే నందిని లేచి కూర్చొని ఉంది దిక్కులు చూస్తూ, తల్లిని చూడగానే అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు బాగున్నావా. అంటూ తన దగ్గరికి వచ్చింది. సుజాతకు చాలా సంతోషం ,అందులోనూ ఆశ్చర్యం కలిగింది. నిన్నటి వరకు స్పృహలో లేకుండా నిస్తేజంగా పడుకొని ఉన్న తన కూతురు నందిని, ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా నవ్వుతూ తనని పలకరించడం తనకి చాలా సంతోషం వేసింది.

ఇన్నాళ్లు తన పడిన వేదన అంతా ఇంతా కాదు ఒక గానొక కూతురు అని హైదరాబాద్ కి పంపిస్తే ఇక్కడ ఇలా అవడం, వెంటనే తను రావడం ఏం జరిగిందో తెలియక అసలు ఏ విషయం తెలియక తను ఎంత మధనపడిందో, వేదన అనుభవించిందో, తనకు ఒక్కదానికే తెలుసు. తండ్రి లేని పిల్లని ఎంతో ముద్దుగా పెంచుకుంది, ఒక్కాగానొక్క  కూతుర్ని. అలాంటిది కూతురికి ఇలా జరిగిందని ఫోన్ రావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక. ఎంతో మానసిక వేదన అనుభవించిన తనకి నందిని అలా పలకరించడం మనసు ఎంతో తేలికగా అనిపించింది.

ఏంటమ్మా మాట్లాడవు ఎప్పుడొచ్చావు నువ్వు? అయినా నాకు చెప్పకుండా రావడం ఏమిటి, ఇన్నాళ్లు ఏమైపోయావ్ అమ్మ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవు, అసలు అంటూ తల్లిని కదపడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చిన సుజాత, ఏం లేదమ్మా ఏదో బిజీగా ఉండిపోయాను అంటూ సర్ది చెప్పింది.

సరే పద నేను నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అంది సుజాత. ఆ మాట వినగానే నందిని ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఏమిటి నన్ను తీసుకెళ్లడానికి వచ్చావా నేను రాను నేను ఇక్కడే ఉంటాను నేను లేకపోతే తనకి తోడెవరు ఉంటారు తను ఒక్కతే ఉంటుంది. నేను వెళ్ళిపోతే తను సూసైడ్ అయిన కూడా చేసుకోవచ్చు అమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉండు ఇద్దరం కలిసి తనని కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు అంటూ ఏదేదో మాట్లాడుతుంది నందిని.

ఏంటి నందు ఎవరు? ఇక్కడ ఎవరున్నారు మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరు కదా అంది సుజాత చుట్టూ చూస్తూ, అదేంటమ్మా అలా అంటావు, నీ పక్కనే నవ్వుతూ నిల్చుంది ఉష .చూడు తనని వదిలేసి వెళ్తామా చూడు అమ్మ ఏమంటున్నారో నన్ను తీసుకెళ్లడానికి వచ్చిందంట. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను చెప్పు. మా ముగ్గురం కలిసి వెళ్దాం ,లేదా ఉంటే ముగ్గురం కలిసి ఉందాం. అంది నందిని గారంగా, సుజాత ఉలిక్కి పడుతూ చుట్టూ చూసింది. ఇంట్లో తామిద్దరo తప్ప ఇంకొక మనిషి జాడలేదు. కానీ నందినేమో ఉష అంటూ పిలుస్తోంది. ఇదేదో తెలుసుకోవాల్సిన వ్యవహారం లాగా అనిపించింది.

ఒక నిర్ణయానికి వచ్చినానులే సరేనమ్మా ఉందాం లే, ఇంట్లో సరుకులు ఏవి లేవు, నేను కిందికి వెళ్లి తీసుకు వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అంది నందినితో, లేదమ్మా ముగ్గురం కలిసి కిందికి వెళ్లి సరుకులు తీసుకొని వద్దాం, పద ఉష అంటూ ఎవరిదో చేయి పట్టుకొని నడిపించుకుంటూ మరో చేత్తో తల్లిని పట్టుకొని బయటకి నడిచింది నందిని.

అసలు పక్కన లేని మనిషి ఎవరు కనిపించకుండా ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాలేదు సుజాతకు. అలాగని కూతురుతో అనను లేదు. ఎందుకంటే మళ్లీ సృహతప్పి  పడిపోతుందేమో అనే భయం వల్ల ఏమీ అనలేక తనతో పాటు నడిచింది సుజాత. అపార్ట్మెంట్ కిందికి వెళ్ళాక అక్కడ సూపర్ మార్కెట్లో ఓవైపు నందిని నడుస్తూ , అమ్మ నేను ఉష ఇటు వైపు సరుకులు తీసుకుంటాం. నువ్వు ఆ వైపు నీకు కావలసినవి తీసుకో అని చెప్పి ఓ పక్కగా నడిచింది.

అదే అదునుగా తీసుకున్న సుజాత గబగబా సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్లింది. సెక్యూరిటీ గార్డు సుజాతను చూసి ఏంటమ్మా ఏమైనా అవసరం ఉందా, ఏమైనా తెచ్చి పెట్టాలా, అంటూ దగ్గరగా వచ్చాడు. నీ పేరేంటి అయ్యా అంటూ అడిగింది సుజాత. అమ్మ నా పేరు దుర్గేష్ అందరూ దుర్గా అంటారు అన్నాడు అతడు.

ఓ అవునా దుర్గ చాలా మంచి పేరు దేవత పేరు పెట్టుకున్నావు. సరేగాని ఇంతకుముందు మా అమ్మాయితో పాటు ఆ గదిలో ఇంకెవరైనా ఉండేవారా అంటూ ఆరాలు తీసింది. అవునమ్మా ఇంకా ఇంకొక అమ్మాయి పేరు ఉష అనుకుంటా ఆ అమ్మాయి ఉండేది.

ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసేది. పగలు రాత్రి తేడా లేకుండా ఒకటే పని. ఎప్పుడు వచ్చేదో ,ఎప్పుడు వెళ్లేదో, ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు అబ్బాయి బైక్ మీద దింపి వెళ్లేవాడు, అతనితో చాలా సంతోషంగా కనిపించేది, కానీ ఏమైందో ఏమో ఒక రోజు రావడం రావడమే బాధగా కనిపించింది. ఆ అమ్మాయి స్కూటీ నాకు అందిస్తూ స్కూటీ ఇక నీకే తీసుకో దుర్గేష్ అంది బాధపడుతూ, ఏమైంది అమ్మ ఎందుకు నాకు ఇస్తున్నారు అంటూ అడిగాను, ఇంక నేను ఉండను కదా అంటూ పైకి వెళ్ళిపోయిన అమ్మాయి కిందికి శవం గా వచ్చింది. నేను ఊహించలేదమ్మా నేను స్కూటీ పార్కు చేసి వచ్చేంతలో పైన టెర్రస్ పైకి వెళ్లి పైనుంచి దూకి ఇదిగో ఇక్కడే పడి చనిపోయింది చెప్పాడు సెక్యూరిటీ గార్డ్.

ఎందుకు? ఏమైంది ?ఎందుకు చనిపోయింది? అమ్మాయి అంది సుజాత. ఆ ఏముందమ్మా ఆ అబ్బాయి ఎవరో ఒకరు రోజు డ్రాప్ చేసేవాడు కదా, అతను ప్రేమించానని మోసం చేశాడు. అందుకని ఆ అమ్మాయి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆరోజు నందినమ్మ ఇంట్లో లేదు. కాదు ఊర్లోనే లేదు మీ దగ్గరికి వచ్చింది.

దసరా పండగ కోసం అమ్మాయి గారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా జరిగింది. నందినమ్మ గారు వచ్చాక కొన్నాళ్లు బాగానే ఉంది, ఆ తర్వాతే ఎంతసేపటికి కిందికి రాకపోతే నేను పైకి వెళ్లాను, నందినమ్మ బయట స్పృహలో లేని స్థితిలో పడి ఉంది, వెంటనే నేను పక్కనున్న ఆసుపత్రిలో జాయిన్ చేసి మీకు ఫోన్ చేశాను అంటూ చెప్పాడు.

సుజాతకు కొంచెం అర్థమయ్యే కానట్టుగా అనిపిస్తుంది. ప్రేమలో మోసపోయిన ఉష ఆత్మహత్య చేసుకుంది. ఊరు నుంచి వచ్చాక విషయం తెలిసినా నందిని ఆ విషయం తట్టుకోలేకపోయింది. లేదా నందిని తన దగ్గర తనతో పాటే ఉంటున్నట్టుగా ఊహించుకుంటూ ప్రవర్తించసాగింది. లేదా తన రూమ్ లో ఉన్నందుకు భయపడి అయినా సృహ కోల్పో వచ్చు. లేదా ఉష అయినా దయ్యంలా మారి తనని భయపెడుతూ ఉండొచ్చు, లేదా బెదిరిస్తూ ఉండొచ్చు, అనుకున్న సుజాత. సరే దుర్గేష్ ఇదిగో అంటూ 100 నోటు అతను చేతిలో పెట్టి మళ్ళీ ఎప్పట్లా సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది.

ఏంటమ్మా ఎక్కడికి వెళ్లావు చూడు నేను ఉషా కలిసి ఎంత షాపింగ్ చేసాము అంటూ చేతిలో ఉన్నవన్నీ చూపించింది నందిని. పక్కన లేని ఉష గురించి మాట్లాడుతుంది, అంటే ఉష నందు కి చాలా స్నేహం గా ఉండాలి. తన చావు తను తట్టుకోలేకపోయింది. అందువల్లే ఇలా ప్రవర్తిస్తుంది. ఏమైతేనేం సృహలో కైతే వచ్చింది. ఇలా కాదు మెల్లిగా నందిని తానే మార్చాలి అనుకుని సుజాత. సరేనమ్మా పదండి సరుకులు మీరు తీసుకున్నారు కదా, ఇంట్లోకి వెళ్దాం అంటూ మళ్ళీ ఫ్లాట్లోకి వచ్చారు.

వారం రోజులు ఉషకి ఇది ఇష్టం, అది ఇష్టం, అంటూ రకరకాలుగా వడ్డిoచింది. సుజాతతో నందిని. సుజాత కూడా ఏమీ మాట్లాడకుండా నందిని చెప్పినట్లుగా వండుతూ, వడ్డిస్తూ ,తనకు కనిపించని మరో వ్యక్తికి వడ్డిస్తూ ,తనతో తాను కూడా మాట్లాడుతూ, ఉష ఉన్నట్టు తమ ముగ్గురు సరదాగా కబుర్లు చెబుతున్నట్టు సరదాగా సినిమాలు ,షికార్లు చేస్తున్నట్లుగా నందినితో ప్రవర్తించింది సుజాత.

**********

వారం రోజుల తర్వాత అమ్మ అంటూ వంటింట్లో వంట చేస్తున్న సుజాత దగ్గరికి వచ్చింది నందిని. ఏంటమ్మా ఈరోజు ఏమైనా స్పెషల్ చేయమంటుందా? మీ ఉష అంటూ మళ్ళీ అడిగింది. అది అమ్మ ఉషా వెళ్లిపోయింది అమ్మ అంటూ చెప్పింది నందిని. ఏంటి ఉషా వెళ్లిపోయిందా ఆ మాట ముందే చెప్పొచ్చు కదా నేను ఎక్కువ రైస్ వేసేసాను అంది సుజాత.

లేదమ్మా ఉష చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది. తాను ఇన్ని రోజులు నన్ను ఎంతో కష్టపెట్టానని నాతోపాటు నిన్ను నువ్వు కూడా ఎంతో కష్టపడ్డావని ఇక నాకు సమయం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. ఇంక నిన్ను ఎప్పుడూ నేను వేధించను. అంటూ వెళ్లిపోయిందమ్మ, తాను అనుకున్నది దక్కలేదని,

అనవసరంగా తన ప్రాణాలు తీసుకున్నానని తాను అలా చేసేది లేకుండా ఉంటే ఇప్పుడు ఎంతో బాగుండేదని. తన తల్లిదండ్రులు తన గురించి ఎంతో విలపిస్తున్నారని ఇంకా నిన్ను నేను బాధ పడేలా చేయడం సరికాదని, మీ అమ్మగారిని కూడా నేను వేధిస్తున్నాను. నేను ఉండలేను వెళ్ళిపోతాను అని ఇక ఇంకెప్పుడూ నీ దగ్గరికి రానని చెప్పింది, అమ్మ అంటూ ఏడుస్తూ తల్లి ఒళ్లో వాలిపోయింది నందిని.

నందిని గుండెలకు అదుముకుని  వీపునిమూరుతో దుర్గేష్ తో మాట్లాడిన తర్వాత తాను నందిని డైరీలు చదవడం అందులో ఉష ,నందిని చాలా స్నేహంగా ఉండడం దసరా సెలవులకు వచ్చిన నందిని ఆ తర్వాత హైదరాబాద్ కి రాగానే ఉష మరణ వార్త తెలిసి మానసికంగా నలిగిపోవడం తెలుసుకుంది. 

ఆ బాధలోనే ఉష తనతోనే ఉన్నట్టు తనతో మాట్లాడుతున్నట్టు భ్రమలో ఉంటూ, తనను తాను హింసించుకుంటూ తాను సమయానికి  లేకపోవడం వల్లే ఉషని  కాపాడుకోలేకపోయాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ తో నందిని ఇన్నాళ్లు బాధపడడం. ఆ తర్వాత గృహ లేకుండా మూడు నెలలు కోమాలో ఉండడం ఇవన్నీ జరిగాయి.

తాను డైరీ చదివి వాళ్ళ స్నేహం గురించి తెలుసుకొని వారికి తగినట్లుగా మెదలడంతో నందిని భ్రమలోంచి బయటకు వచ్చి, ఉష లేదనే నిజాన్ని జీర్దించుకొని ఇన్నాళ్ల తన వేదనంతా ఏడుపు రూపంలో బయటకు తీసుకురావడం వల్ల తన మనస్సు కూడా తేలికపడింది.

****

ఆరోజు సాయంత్రం సుజాత కూతురు నందిని తో పాటు తమ ఊరికి వెళ్లడానికి ఆటో ఎక్కుతూ, దుర్గేష్ తో వస్తాం బాబు మాకు చాలా సహాయం చేశావు అంటూ చేతిలో 500 రూపాయలు పెట్టింది.

నేనేం చేశాను అమ్మ, నందినమ్మ ప్రతిరోజు 8 గంటల లోపు ఆఫీస్కి వెళ్లిపోయేది ఆరోజు ఎంతకీ రాకపోవడంతో ఏమైందా అని వెళ్లి చూశాను తను బయటపడి ఉండడం చూసి ఆస్పత్రిలో జాయిన్ చేసి మీకు ఫోన్ చేశాను అంతే కదా నేను చేసింది అన్నాడు.

అవును అంతే చేశావు కానీ నా కూతురిని నాకు దక్కించావు. ఇంకొకరు అయ్యుంటే ఇంకేం చేసేవారో అందుకే ఇస్తున్నాను తమ్ముడు తీసుకో అంటూ ఆనందంగా చేతిలో పెట్టి నొక్కింది సుజాత.

ఆటో కదిలింది. తల్లి భుజంపై తలవాల్చి నందిని రోడ్డు వైపు చూస్తుంది. సుజాత తన మనసులో తన కూతుర్ని తాను బాగు చేసుకున్నందుకు చాలా గర్వించింది.లోకం తన కూతుర్ని పిచ్చిది అనే ముద్ర వేయకుండా తన కూతుర్ని కాపాడుకుంది సైకాలజీ ప్రొఫెసర్ సుజాత.

 

 -భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *