నమ్మకం ఉంది
విశాల్ , శృతి రెండు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రేమని ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. కానీ విశాల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
“అక్క ఇంకా శృతి వాళ్ళు రాలేదు” అని చెప్పింది చంద్రకళ.
“నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేశాను. వస్తున్నారు అంట” అని చెప్పింది లలిత.
పక్కనే నిలబడి ఉన్న వాళ్ళని చూసి
“ఏంటి పద్మ నువ్వు , షాలిని అలా నిలబడి ఉన్నారు.
పెళ్లికి టైం అవుతుంది. మీరు వెళ్లి రెడీ అవ్వండి” అని చెప్పింది లలిత.
“నా కూతురిని కాదు అని నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు” అని చెప్పి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు పద్మ , షాలిని.
“అమ్మా ఈ పెళ్లి జరగకుండా మనం ఎలాగైనా ఆపాలి” అని చెప్పింది షాలిని.
“పెళ్లి కూతురు స్థానంలో నువ్వు ఉంటేలా ప్లాన్ చేస్తున్నాను” అని చెప్పింది పద్మ.
“అక్క శృతి వాళ్ళు వచ్చారు” అని చెప్పింది చంద్రకళ.
“హా వస్తున్నాం” అని చెప్పి లలిత వాళ్ళు శృతి వాళ్ళని మర్యాదగా ఆహ్వానించారు.
పెళ్లి ఘనంగా జరిగింది పద్మ , షాలిని వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి.
అప్పగింతలు అయిపోయిన తర్వాత శృతి వాళ్ళ పేరెంట్స్ వెళ్లిపోయారు.
విశాల్ వాళ్ల ఫ్యామిలీతో శృతి ఒక్కరోజులోనే కలిసిపోయింది.
కానీ తన చుట్టూ కపట ప్రేమ నటిస్తూ మనుషులు ఉన్నారని తను తెలుసుకోలేక పోయింది.
షాలిని ఏదో ఒక విషయంలో విశాల్ తో చనువుగా ఉండేది కానీ అది ఫస్ట్‌లో పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత అనుమానం పెరిగేలా శృతిలో కలిగించారు.
ఆరోజు విశాల్ బర్త్ డే తనే ఫస్ట్ విషెస్ చెప్పాలని వెయిట్ చేస్తుండగా లలిత వచ్చి పాయసం చేయమని చెప్పింది.
పాయసం చేసి తీసుకొని వచ్చినప్పటికీ షాలిని వచ్చి విషెస్ చెప్పేది ఏదో సీక్రెట్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది విశాల్ తో అది చూసిన శృతి కన్నీళ్ళతో వెళ్లిపోయింది.
ఎప్పుడు నుంచి విశాల్ , శృతి ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం బర్త్ డే పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తుంది శృతి రెడీ అయ్యి పార్టీ దగ్గర వెళ్లుతుగా ఎదురు వచ్చాడు విశాల్.
“ఏంటి శృతి ఈరోజు నా బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు ఎందుకు? నీ విషెస్ కోసం ఎంతో ఎదురు చేశాను” అని చెప్పాడు విశాల్.
“ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే” తన చెయ్యిని పట్టుకొని లాగాడు విశాల్.
వాళ్లకు కొంచం దూరంగా పద్మ , షాలిని వాళ్ళని చూసి “అమ్మా బావ , శృతి మళ్ళీ కలిపోతారేమో” అని భయంగా చెప్పింది.
వీళ్ళ మాటలు విన్న ఒకతను ఈ విషయం శృతికి మెసేజ్ చేసాడు. అది చూసి విశాల్ నన్ను వదులు అని చెప్పి ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పింది.
“విశాల్…. విశాల్…..” అని పిలుస్తూ వస్తుంది లలిత.
అది చూసినా విశాల్ శృతిని వదిలేసి లలిత దగ్గరకు వెళ్ళిపోయాడు.
శృతి వెంటనే ఎవరికో ఫోన్ చేసి
“నేను చెప్పిన పని ఎంత వరకు వచ్చింది” అని అడిగింది.
“వన్ వీక్ లో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను” అని చెప్పాడు.
“ఒకే బీ కేర్ ఫుల్” అని చెప్పి కాల్ కట్ చేసింది శృతి.
ఇంట్లో అందరి ముందు మాత్రం సంతోషంగా ఉన్నారు కానీ విశాల్ మనసులో చాలా బాధ పడుతున్నాడు.
పార్టీ చాలా బాగా జరిగింది.
వన్ వీక్ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ లలిత తన స్నేహితురాల కూతురికి పెళ్లి వెళ్ళాలని అనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల విశాల్
“నేను పెళ్లికి మీతో రాలేను. నాకు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నాయి” అని చెప్పాడు.
“ఆయనకి తోడుగా నేను ఉంటాను అత్తయ్య” అని చెప్పింది శృతి.
నెక్స్ట్ రోజు మార్నింగ్ అందరూ బయలుదేరారు.
తరువాత విశాల్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
“నన్ను క్షమించు విశాల్. మా పెళ్లి అయ్యిన దగ్గర నుండి నేను నీకు దూరంగా ఉండడానికి కారణం మీ అత్తయ్య పద్మ , షాలిని.
నాకు వాళ్ళు గురించి పెళ్లి కాకముందే తెలిసింది. వాళ్లకి బుద్ధి చెప్పడానికి నేను కంకణం కట్టుకున్న.
ఈ విషయాలన్నీ నీతో చెప్పోపోవడనికి కారణం నిన్ను వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. అది నమ్మి నువ్వు వాళ్ళని ఇంట్లోనే ఉంటామంటావు.
మా అన్నయ్య రాకేష్ ,షాలిని ని ప్రేమిస్తున్నాడు.
వాళ్ళ ఇద్దరిని కలపడానికి కోసం వాళ్ళతో పాటు అన్నయ్యని పంపించాను. నువ్వు అపార్థం చేసుకోకుండా అర్దం చేసుకుంటావాన్ని అనుకుంటున్నాను అని మెసేజ్ పెట్టింది శృతి.”
సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన విశాల్ కి “కాఫీ ఇచ్చి నేను పంపించిన మెసేజ్ చూసావా అని అడిగింది శృతి.”
“ఏం మెసేజ్ చేశావు నేను చూడలేదు” అని అబద్ధం చెప్పాడు విశాల్.
“ఓ.. చూడలేదా. సరే నేను ఇప్పుడు చెపుతాను విను అని చెప్పింది”
శృతి చెప్పిన ఐదు నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కావాలనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు విశాల్.
ఇంకా కోపంతో చూసి వెళ్ళిపోయింది శృతి.
మెల్లగా వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకున్నాడు విశాల్.
వాళ్ళ మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయి.
నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పాడు విశాల్.
అక్కడ పెళ్లిలో రాకేష్ కావాలనే షాలిని మెడలో తాళి కట్టాడు.
అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ వాళ్ళ పెళ్లిని అంగీకరించారు..
ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత శృతి ప్రెగ్నంట్ అని ఆనందపడ్డారు.
గతంలో పద్మ , షాలిని మనసుల్లో ఉన్న కపట ప్రేమ నటిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరిని ప్రేమగా చూస్తుకుంటున్నారు.
–మాధవి కాళ్ల