నమ్మక ద్రోహం
మన జీవితంలోనే ఎన్నో అనుభవాలు మనకు పాఠం నేర్పిస్తాయి..నిజంగా నమ్మిన వాళ్లే చాలా మెాసం చేస్తారు అదెలా అంటే…
ఇదొక చిన్న సంఘటన పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కానీ ఈ చిన్న సంఘటనైతే ముందు చెప్తాను..
మావారు మా ఇంటి దగ్గర ఒక షాపతను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతంటె తన షాపులోకి సామాన్లు తెచ్చుకోవడానికి మా వారి జీతం మెుత్తం తీసుకుని ఇద్దరూ కలిసి వెళ్లి అన్నీ తెచ్చాక మాకు ఖాతాలో సామాను ఇచ్చేంత..
వినడానికి ఎలాగో ఉంది కదూ! కానీ అదే నిజం మా కారులోనె అతని సామానంతా తెస్తాడు డబ్బులన్నీ మావే!
ఒకసారి మా అక్క కొడుకు మా ఇంటికి వచ్చాడు తలనొప్పంటే జండూబామ్ తెప్పించా!
అది ఎంత పెట్టుకున్నా అసలు వాసనే లేదని దాన్ని పరీక్షిస్తే అది జనూ బామ్ అట డుప్లికేట్ అదే విషయం అతడు మా ఇంటికి వచ్చినపుడు అడిగితే తెలిసిందా?
అని ఇల్లు టాప్ ఎగిరి పోయేలా నవ్వాడు నవ్వుతూ నమ్మిన వాల్లను కాకపోతే నమ్మని వాల్లను ఎలా మెాసం చేస్తాను? అన్నాడు..
ఇలాంటివి మాకు లక్షల్లో కూడా జరిగాయి అవి రాస్తే చాలా బాధ కలుగుతుందని ఈ చిన్నది రాసాను అంతే!!
ఇదే నమ్మక ద్రోహం!!
-ఉమాదేవి ఎర్రం