నమస్కారాలు
నా చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని ట్యూషన్ లో జాయిన్ చేసింది. నేను ట్యూషన్ జాయిన్ అవ్వకముందు ట్యూషన్ టీచర్ వాళ్ళ పిల్లలతో గొడవ జరిగింది.
నేను మొదట రోజు వెళ్ళినప్పుడు టీచర్ పిల్లలను చూసి షాక్ అయ్యాను.
అప్పుడే అమ్మో నేను టీచర్ పిల్లలతో గొడవ పడ్డాను అని తెలిస్తే నా పని అయిపోయింది అని అనుకున్నా. టీచర్ పిల్లలు నా దగ్గరికి వచ్చి ఆరోజు జరిగిన గొడవ వదిలేయ్.
ఇప్పుడు నుంచి మనం మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు.
ఆ విషయం వాళ్ళు చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా టీచర్ ఫ్యామిలీతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది.
చదువు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మాకు ప్రతిది ఒక పాఠం లాగా చెప్పేవారు.
టీచర్ ఏ విషయంలో అయినా సరే నిజమే చెప్పాలి అని అనేవారు.
అబద్ధం చెప్తే మన చుట్టూ ముట్టే సమస్యలనుండి తప్పించుకోలేక , మరికొన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుందని చెప్పేవారు.
అది ఎంత చేదు నిజమైన, నిజం చెప్పేస్తే ఒక్కసారే దెబ్బలు తింటాం.
అదే అబద్ధాలు చెప్తే ప్రతిరోజు టెన్షన్ పడవలసి వస్తుంది.
ఇది నా జీవితంలో జరిగింది కూడా. అప్పటినుంచి నిజం చెప్పడం అలవాటు చేసుకున్నాను.
టీచర్ వాళ్ళ పిల్లలతో సమానంగా మమ్మల్ని చూసుకునేది.
మా తల్లిదండ్రులు తర్వాత ఎక్కువ అభిమానించింది ఈ ట్యూషన్ టీచర్ నే.
నువ్వు అన్నిట్లో పోటీ పడాలి ఓడిపోయిన పర్వాలేదు అని ప్రోత్సహించేవారు.
ఇంట్లో అమ్మకి పనుల్లో హెల్ప్ చేయమనడం చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా చదువుకోవాలి అని చెప్పేవారు.
అలాంటి టీచర్ కి దూరంగా వెళ్లిపోయినందుకు చాలా బాధపడ్డాను.అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ కలిసి వస్తూనే వాళ్ళం.
టీచర్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.మీ స్నేహం ఎప్పటికీ మరువలేనిది.
ప్రతి గురు పౌర్ణమి నాడు మీ ఆశీస్సులు తీసుకునే వాళ్ళం.
ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.
మీ విద్యార్థులగా మేమెప్పుడూ ఉంటాము. మీ పాదాలకు నా యొక్క నమస్కారాలు టీచర్..
-మాధవి కాళ్ళ