నామ మాత్రపు ఉనికేనని…!!!
ప్రతి సాధింపు ఏదో ఘణత చేసిన
ప్రాథిపదికకు సూత్రమని మనస్సున
సాత్వికపు చతుర్విదాల గమనాన్ని
గరుకురాయి గంధంగా కరగదీస్తు స్వార్థం
దోసిన కూడు గుడ్డకు కరువై బతికే
సాహసానికి సారథ్యం వహించలేక పోతావు…
గర్భితపు పరిమళమని లోకం మెచ్చిన
దాతువులుగా రూపాంతరం చేసి…
అదోలోకపు అవతారంగా అల్లుకు పోయిన
చీకటితో కారు మబ్బులు కంటి చెమ్మల
నీడలలో లోకాన్ని కప్పిన ధైర్యం నాదేనని
ప్రళయాగ్ని స్వరూపుడు దినకరని
పాదోదకాన్ని ఆపలేవు…
నవలోకపు ఉత్తేజితాలకు నియామకమై
గతాన్ని మరువని శ్రామిక వాదంతో
విధి తలచిన వైవిద్యాలను తన వెలుగుల
చైతన్యాలతో నడిపిస్తు అందరి బతుకుల
నిరంతరానికి ఆనందకరమై ప్రబలే ఉదార
స్వభావాన్ని చీకటి వెలుగులుగా
ఆవిష్కరిస్తున్నాడు….
విజయం సాధింపునకు దొరికిన నామ
మాత్రపు ఉనికేనని నిత్యం నూతనమై…
కొలిచే ఆరాధ్యం దైవమై మానసిక
స్వేచ్ఛలను అనుసరిస్తు నైతిక ప్రభావాలచే
అన్వయింపుల సాధ్యమని ప్రతి క్షణాన్ని
బలపరుస్తు ఆస్వాధించబడు విజయానికై…
-దేరంగుల భైరవ